Adanuni saragule yamgadivi

అతనుని సరకులే యంగడివి
Language

(॥పల్లవి॥)
అతనుని సరకులే యంగడివి
అతివలె కడు నీ కమ్మెద రదివో

(॥అతను॥)
చక్కందనములు జవ్వనమదములు
చెక్కుల నగవులు సిగ్గులును
మొక్కుల చూపులు మురిపంబులు నీ
యక్కఱ దీరఁగ నమ్మెద రదివో

(॥అతను॥)
గుబ్బల మించులు కొప్పుల చెదరులు
సిబ్బెపు మేనుల చెమటలును
గబ్బితనంబులు గసరుల జంకెలు
అబ్బరముగ నీ కమ్మెద రదివో

(॥అతను॥)
తలపోఁతలు చింతాపరవశములు
వలచి వేంకటేశ్వర నీకు
కల వీ యంగడిఁ గదియకు నన్నిటు
లలసితి విదె నీ కమ్మెద రదివో

(||pallavi||)
adanuni saragule yaṁgaḍivi
adivalĕ kaḍu nī kammĕda radivo

(||adanu||)
sakkaṁdanamulu javvanamadamulu
sĕkkula nagavulu siggulunu
mŏkkula sūbulu muribaṁbulu nī
yakkaṟa dīram̐ga nammĕda radivo

(||adanu||)
gubbala miṁchulu kŏppula sĕdarulu
sibbĕbu menula sĕmaḍalunu
gabbidanaṁbulu gasarula jaṁkĕlu
abbaramuga nī kammĕda radivo

(||adanu||)
talabom̐talu siṁtābaravaśhamulu
valasi veṁkaḍeśhvara nīgu
kala vī yaṁgaḍim̐ gadiyagu nanniḍu
lalasidi vidĕ nī kammĕda radivo