Adanim dodidechchinamdaamkaa

అతనిఁ దోడితెచ్చినందాఁకా
Language

(॥పల్లవి॥)
అతనిఁ దోడితెచ్చినందాఁకా
హితబుద్దుల చెలి యేమరకుమీ

(॥అత॥)
వెలఁది విరహముల వేసవికాల మిది
యెలమి మోవిచిగు రెండనీకుమీ
కలికి నిట్టూర్పులగాలికాల మదె
తెలివలపుపదను తియ్యనీకుమీ

(॥అత॥)
వనిత పెంజెమట వానకాలమదె
మొనపులకననలు ముంచనీకుమీ
మనవుల సిగ్గుల మంచుఁగాల మదె
ఘనకుంచగిరులనుఁ గప్పనీకుమీ

(॥అత॥)
వెసఁ గాంత నవ్వువెన్నెల కాలము
ససిఁ గొప్పుచీఁకటి జారనీకుమీ
పసగా శ్రీవేంకటపతి విచ్చేసి కూడె
వసంతకాల మిదె వదలనీకుమీ

(||pallavi||)
adanim̐ doḍidĕchchinaṁdām̐kā
hidabuddula sĕli yemaragumī

(||ada||)
vĕlam̐di virahamula vesavigāla midi
yĕlami movisigu rĕṁḍanīgumī
kaligi niṭṭūrbulagāligāla madĕ
tĕlivalabubadanu tiyyanīgumī

(||ada||)
vanida pĕṁjĕmaḍa vānagālamadĕ
mŏnabulagananalu muṁchanīgumī
manavula siggula maṁchum̐gāla madĕ
ghanaguṁchagirulanum̐ gappanīgumī

(||ada||)
vĕsam̐ gāṁta navvuvĕnnĕla kālamu
sasim̐ gŏppusīm̐kaḍi jāranīgumī
pasagā śhrīveṁkaḍabadi vichchesi kūḍĕ
vasaṁtagāla midĕ vadalanīgumī