(॥పల్లవి॥)
అతనిఁ బాడెదను అది వ్రతము
చతురుని శేషాచలనివాసుని
(॥అతని॥)
నకాదులు యే సర్వేశుఁ గొలిచిరి
అనిశము శుకుఁ డెవ్వనిఁ దలఁచె
మును ధ్రువుఁ డేదేవుని సన్నుతించె
ఘననారదుఁ డేఘనునిఁ బొగడెను
(॥అతని॥)
యెలమి విభీషణుఁ డేదేవు శరణనె
తలఁచె భీష్ము డేదైవమును
బలు ప్రహ్లాదుని ప్రాణేశుఁ డెవ్వఁడు
యిలలో వసిష్టుఁ డేమూర్తిఁ దెలిసె
(॥అతని॥)
పురిగొని వ్యాఁసుడేపురుషునిఁ జెప్పెను
తిరముగ నర్జుని దిక్కెవ్వఁడు
మరిగిని యలమేల్మంగపతి యెవ్వఁడు
గరిమల శ్రీవేంకటేశుఁ డీతఁడు
(||pallavi||)
adanim̐ bāḍĕdanu adi vradamu
saduruni śheṣhāsalanivāsuni
(||adani||)
nagādulu ye sarveśhum̐ gŏlisiri
aniśhamu śhugum̐ ḍĕvvanim̐ dalam̐sĕ
munu dhruvum̐ ḍedevuni sannudiṁchĕ
ghananāradum̐ ḍeghanunim̐ bŏgaḍĕnu
(||adani||)
yĕlami vibhīṣhaṇum̐ ḍedevu śharaṇanĕ
talam̐sĕ bhīṣhmu ḍedaivamunu
balu prahlāduni prāṇeśhum̐ ḍĕvvam̐ḍu
yilalo vasiṣhṭum̐ ḍemūrdim̐ dĕlisĕ
(||adani||)
purigŏni vyām̐suḍeburuṣhunim̐ jĕppĕnu
tiramuga narjuni dikkĕvvam̐ḍu
marigini yalamelmaṁgabadi yĕvvam̐ḍu
garimala śhrīveṁkaḍeśhum̐ ḍīdam̐ḍu