Adanigi buddiseppa rammalaala

అతనికి బుద్దిచెప్ప రమ్మలాల
Language

(॥పల్లవి॥)
అతనికి బుద్దిచెప్ప రమ్మలాల
తతి నిన్నిటా ఘనుఁడు తానిది యెఱఁగడా

(॥అత॥)
చెంది యెవ్వతెకు వలచితేఁ దా వంచుఁగాక
కందువచెమట మేనఁ జిందవలెనా
పొందు లేడనైనాఁ జేసి పోసఁగినా వద్దనేమా
అందపుమే నింతపచ్చియై వుండవలెనా

(॥అత॥)
మంతనాన నెవ్వతెతో మాటాడినా నాడుఁగాక
పొంత నిట్టె మోవిపైఁ గెంపులు వలెనా
మంతుకెక్క నెవ్వరిని మన్నించినా నందుకేమి
వింతవుంగరాలు తనవేల నుండవలెనా

(॥అత॥)
సరి నెవ్వతెపై సేస చల్లినాం జల్లుఁగాక
సురతపుచిన్న మేనఁ జూపవలెనా
ఇరవై శ్రీవేంకటేశుఁడే నలమేలుమంగను
సొరిది నన్నేలినచోప్పు లనవలెనా

(||pallavi||)
adanigi buddisĕppa rammalāla
tadi ninniḍā ghanum̐ḍu tānidi yĕṟam̐gaḍā

(||ada||)
sĕṁdi yĕvvadĕgu valasidem̐ dā vaṁchum̐gāga
kaṁduvasĕmaḍa menam̐ jiṁdavalĕnā
pŏṁdu leḍanainām̐ jesi posam̐ginā vaddanemā
aṁdabume niṁtabachchiyai vuṁḍavalĕnā

(||ada||)
maṁtanāna nĕvvadĕdo māḍāḍinā nāḍum̐gāga
pŏṁta niṭṭĕ movibaim̐ gĕṁpulu valĕnā
maṁtugĕkka nĕvvarini manniṁchinā naṁdugemi
viṁtavuṁgarālu tanavela nuṁḍavalĕnā

(||ada||)
sari nĕvvadĕbai sesa sallināṁ jallum̐gāga
suradabusinna menam̐ jūbavalĕnā
iravai śhrīveṁkaḍeśhum̐ḍe nalamelumaṁganu
sŏridi nannelinasoppu lanavalĕnā