అతని తలపు దెలియఁగరాదా । నీ
(॥పల్లవి॥)
అతని తలపు దెలియఁగరాదా । నీ-
మతిలోని కాఁకలెల్ల మందలించేఁగాని
(॥అత॥)
అన్నియుఁ జెప్పేఁగాని యతఁడంపినట్టిచెలి-
విన్నపమంతయు నీవు వినరాదా
యెన్నిక లంతటిమీఁద నెట్టువలసిన నయ్యీ
కన్నులఁ గన్నంతనే గారవించుమీ
(॥అత॥)
ఇద్దరితలంపులకు నిక్కువ చెప్పేఁగాని
పెద్దరికమున నాకెఁ బెంచరాదా
గద్దరిచలములేల కలది కలిగినట్టె
వొద్దిక నన్నియు నీ వొప్పుగొనుమీ
(॥అత॥)
వెలఁదిఁ బుతైంచి తా వెంటనే శ్రీవేంకట-
నిలయుండు వీఁడె వచ్చె నీవు రారాదా
తెలిసి ఇద్దరుఁ గూడితిరి మాకిందరి కిదె
సెలవు నీపతి నిదె చిత్తగించుమీ
(||pallavi||)
adani talabu dĕliyam̐garādā | nī-
madiloni kām̐kalĕlla maṁdaliṁchem̐gāni
(||ada||)
anniyum̐ jĕppem̐gāni yadam̐ḍaṁpinaṭṭisĕli-
vinnabamaṁtayu nīvu vinarādā
yĕnniga laṁtaḍimīm̐da nĕṭṭuvalasina nayyī
kannulam̐ gannaṁtane gāraviṁchumī
(||ada||)
iddaridalaṁpulagu nikkuva sĕppem̐gāni
pĕddarigamuna nāgĕm̐ bĕṁcharādā
gaddarisalamulela kaladi kaliginaṭṭĕ
vŏddiga nanniyu nī vŏppugŏnumī
(||ada||)
vĕlam̐dim̐ budaiṁchi tā vĕṁṭane śhrīveṁkaḍa-
nilayuṁḍu vīm̐ḍĕ vachchĕ nīvu rārādā
tĕlisi iddarum̐ gūḍidiri māgiṁdari kidĕ
sĕlavu nībadi nidĕ sittagiṁchumī