అతని నేఁపేనంటా నట్టే నీవు వేఁగేవు
(॥పల్లవి॥)
అతని నేఁపేనంటా నట్టే నీవు వేఁగేవు
యీతలఁ బోయే పొద్దు లెవ్వరికి సెలవే
(॥॥)
తడఁబాట్టు పతితోడ తలుపుమాఁటున వుండి
యెడమాట లాడించే వేమే నీవు
జడిసి యాతనితోడి చలానకు నీవు నట్టె
వుడికేయ వుసరాఁకల వోరువఁగఁగలవా
(॥॥)
ఆడనుండే తెరలోన అక్కరైనపతికిని
వీడెమిచ్చి పంపే వేమే వెలఁది నీవు
వేడుక నాతని నీవు విరహనఁ బెట్టేనంటా
తోడ నీవు విరహనఁ దొలఁకేవు గదవే
(॥॥)
మాటలాడేపతితోడ మంచముమీఁదనే వుండి
కాటుకకన్నులఁ జూచి కరఁగేవేలే
యీటున శ్రీ వేంకటేశుఁ డింతలో నిన్నుఁ గలసె
వాటమై నీవూఁ గలసి వసమైతి గదవే
(||pallavi||)
adani nem̐penaṁṭā naṭṭe nīvu vem̐gevu
yīdalam̐ boye pŏddu lĕvvarigi sĕlave
(||||)
taḍam̐bāṭṭu padidoḍa talubumām̐ṭuna vuṁḍi
yĕḍamāḍa lāḍiṁche veme nīvu
jaḍisi yādanidoḍi salānagu nīvu naṭṭĕ
vuḍigeya vusarām̐kala voruvam̐gam̐galavā
(||||)
āḍanuṁḍe tĕralona akkarainabadigini
vīḍĕmichchi paṁpe veme vĕlam̐di nīvu
veḍuga nādani nīvu virahanam̐ bĕṭṭenaṁṭā
toḍa nīvu virahanam̐ dŏlam̐kevu gadave
(||||)
māḍalāḍebadidoḍa maṁchamumīm̐dane vuṁḍi
kāḍugagannulam̐ jūsi karam̐gevele
yīḍuna śhrī veṁkaḍeśhum̐ ḍiṁtalo ninnum̐ galasĕ
vāḍamai nīvūm̐ galasi vasamaidi gadave