Adani ne neṟumgudu naadamdu nee vo jeṟumgu

అతని నే నెఱుఁగుదు నాతఁడు నీ వో జెఱుఁగు
Language

(॥పల్లవి॥)
అతని నే నెఱుఁగుదు నాతఁడు నీ వో జెఱుఁగు
నీ తెరువు వచ్చితినా నీ కేలే పగటు

(॥॥)
నన్నుఁ బెండ్లాడె నతఁ డు నాతో నవ్వె నతఁడు
సన్న లేమి సేసేవే సవతి నీవు
కన్నుల మొక్కితి నేను కందువ లంటితి నేను
నిన్ను నేమైనా నంటినా నీకేలే పగటు

(॥॥)
చేయి వేసె నా మగఁడు సిగ్గు దేర్చె నా మగఁడు
చాయ లేమి చూపేవే సవతి నీవు
నాయ మడిగితి నేను ననుపై వుండితి నేను
నీ యెమ్మెలు వద్దంటినా నీ కేలే పగటు

(॥॥)
అలమె శ్రీ వేంకటేశుఁ డదె శ్రీ వేంకటేశుఁడు
చల మేల మానవె సవతి నీవు
అలమేల్మంగను నేను అన్నిటా దేవుల నేను
నిలిచి నీ బత్తి గంటి నీ కేలే పగటు.

(||pallavi||)
adani ne nĕṟum̐gudu nādam̐ḍu nī vo jĕṟum̐gu
nī tĕruvu vachchidinā nī kele pagaḍu

(||||)
nannum̐ bĕṁḍlāḍĕ nadam̐ ḍu nādo navvĕ nadam̐ḍu
sanna lemi seseve savadi nīvu
kannula mŏkkidi nenu kaṁduva laṁṭidi nenu
ninnu nemainā naṁṭinā nīgele pagaḍu

(||||)
seyi vesĕ nā magam̐ḍu siggu dersĕ nā magam̐ḍu
sāya lemi sūbeve savadi nīvu
nāya maḍigidi nenu nanubai vuṁḍidi nenu
nī yĕmmĕlu vaddaṁṭinā nī kele pagaḍu

(||||)
alamĕ śhrī veṁkaḍeśhum̐ ḍadĕ śhrī veṁkaḍeśhum̐ḍu
sala mela mānavĕ savadi nīvu
alamelmaṁganu nenu anniḍā devula nenu
nilisi nī batti gaṁṭi nī kele pagaḍu.