Adani nadugavo sitragupta naayamdali yaumgaamu lanniyunu

అతని నడుగవో చిత్రగుప్త నాయందలి యౌఁగాము లన్నియును
Language

(॥పల్లవి॥)
అతని నడుగవో చిత్రగుప్త నాయందలి యౌఁగాము లన్నియును
అతఁడే మీ కుత్తరము చెప్పెడిని యన్నిటికిని మముఁ దడవకుమీ

(॥అత॥)
కరచరణాదులు నాకుఁ గల్పించిన యతఁడే
గరిమల నా వుభయకర్మసంఘములకుఁ దాఁ గర్తా
సరుగఁ బ్రాణము లొసఁగి చైతన్య మతఁడే
పరగఁగ నాయపరాధంబులు పరిహరించఁ గర్తా

(॥అత॥)
రమణతో ననుఁ బుట్టించి రక్షించే యతఁడే
అమరఁగ నన్ను వహించుక నా వళుకంతయుఁ దీర్చఁగఁ దాఁ గర్తా
ప్రమదమున నాయంతరాత్మయై పాదుకొన్నయతఁడే
మమతల మీలోకము చొరకుండా మాటలాడుకొనఁ దానే కర్తా

(॥అత॥)
యెప్పుడుఁ బాయక దాసునిఁగా నేలుకొన్న యతఁడే
తప్పక యిహముఁ బరమునిచ్చి వొరులు దడవకుండఁ జేయగఁ గర్తా
చెప్పఁగ నాపాలి దేవరా శ్రీవేంకటేశుఁ డతఁడే
అప్పణిచ్చి మిము సమ్మతి సేయుచు నటు మముఁ గావఁగఁ దానే కర్త

(||pallavi||)
adani naḍugavo sitragupta nāyaṁdali yaum̐gāmu lanniyunu
adam̐ḍe mī kuttaramu sĕppĕḍini yanniḍigini mamum̐ daḍavagumī

(||ada||)
karasaraṇādulu nāgum̐ galbiṁchina yadam̐ḍe
garimala nā vubhayagarmasaṁghamulagum̐ dām̐ gardā
sarugam̐ brāṇamu lŏsam̐gi saidanya madam̐ḍe
paragam̐ga nāyabarādhaṁbulu parihariṁcham̐ gardā

(||ada||)
ramaṇado nanum̐ buṭṭiṁchi rakṣhiṁche yadam̐ḍe
amaram̐ga nannu vahiṁchuga nā vaḽugaṁtayum̐ dīrsam̐gam̐ dām̐ gardā
pramadamuna nāyaṁtarātmayai pādugŏnnayadam̐ḍe
mamadala mīlogamu sŏraguṁḍā māḍalāḍugŏnam̐ dāne kardā

(||ada||)
yĕppuḍum̐ bāyaga dāsunim̐gā nelugŏnna yadam̐ḍe
tappaga yihamum̐ baramunichchi vŏrulu daḍavaguṁḍam̐ jeyagam̐ gardā
sĕppam̐ga nābāli devarā śhrīveṁkaḍeśhum̐ ḍadam̐ḍe
appaṇichchi mimu sammadi seyusu naḍu mamum̐ gāvam̐gam̐ dāne karda