(॥పల్లవి॥)
అతని మీరే యిది యడుగరే
చతురతఁ దానే జంకించీనే
(॥అత॥)
పదవికెంపు లవి ప్రియమున నడిగిన
యెదురు గుదురుగా నిటు దిట్టీనే
నిదురకన్నులవె నిదిరించు మనిన
అదనుఁ దానె మఱి యలిగీనే
(॥అత॥)
చెక్కుల చెమటలు చేతులఁ దుడిచిన
గక్కన నూరక కసరీనే
పక్కనఁ బులకలు పయ్యదఁ గప్పిన
చిక్కనిగోళ్లఁ జిమ్మీనే
(॥అత॥)
కళలు చూచి నేఁ గాఁగిట నించిన
మలసి మలసి మయిమఱచీనే
చెలువరాయఁ డిదె శ్రీవేంకటపతి
నలుగడ నన్నే నవ్వీనే
(||pallavi||)
adani mīre yidi yaḍugare
saduradam̐ dāne jaṁkiṁchīne
(||ada||)
padavigĕṁpu lavi priyamuna naḍigina
yĕduru gudurugā niḍu diṭṭīne
niduragannulavĕ nidiriṁchu manina
adanum̐ dānĕ maṟi yaligīne
(||ada||)
sĕkkula sĕmaḍalu sedulam̐ duḍisina
gakkana nūraga kasarīne
pakkanam̐ bulagalu payyadam̐ gappina
sikkanigoḽlam̐ jimmīne
(||ada||)
kaḽalu sūsi nem̐ gām̐giḍa niṁchina
malasi malasi mayimaṟasīne
sĕluvarāyam̐ ḍidĕ śhrīveṁkaḍabadi
nalugaḍa nanne navvīne