అటని మానఁగలేవు అన్నిటాను నీ పొందు
(॥పల్లవి॥)
అటని మానఁగలేవు అన్నిటాను నీ పొందు
యెటువలెఁ జేసినాను యియ్యకొంటి మిపుడు
(॥అట॥)
చనవునఁ దిరిగేము సారెసారె నీ వద్ద
మనసుమర్మ మెఱఁగ మరిగితిని
వెనకటి నీ చెలులు వేమారు నేమందురో
తనిసి వున్నారము నీ తగవులచేతను
(॥అట॥)
సలిగెకుఁ బెనఁగేము సంగతిగా నీకు లోనై
కొలచిన గుణముల కొలఁది చూడ
పెలుచు నీ చేఁతల ప్రియ మెట్లా నున్నదో
సొలసితి మిపుడు మా సోఁగల కన్నులను
(॥ఆట॥)
ఆసలనే కూడితిని అరమరపుల నిన్ను
వాసుల నీరతులలో వైపు దెలియ
సేసవెట్టితివి నాకు శ్రీ వేంకటేశ్వర నీవు
రాసికక్క(కెక్క?) నీవలపు రచ్చలఁ బెట్టితిమి
(||pallavi||)
aḍani mānam̐galevu anniḍānu nī pŏṁdu
yĕḍuvalĕm̐ jesinānu yiyyagŏṁṭi mibuḍu
(||aḍa||)
sanavunam̐ dirigemu sārĕsārĕ nī vadda
manasumarma mĕṟam̐ga marigidini
vĕnagaḍi nī sĕlulu vemāru nemaṁduro
tanisi vunnāramu nī tagavulasedanu
(||aḍa||)
saligĕgum̐ bĕnam̐gemu saṁgadigā nīgu lonai
kŏlasina guṇamula kŏlam̐di sūḍa
pĕlusu nī sem̐tala priya mĕṭlā nunnado
sŏlasidi mibuḍu mā som̐gala kannulanu
(||āḍa||)
āsalane kūḍidini aramarabula ninnu
vāsula nīradulalo vaibu dĕliya
sesavĕṭṭidivi nāgu śhrī veṁkaḍeśhvara nīvu
rāsigakka(kĕkka?) nīvalabu rachchalam̐ bĕṭṭidimi