అతని కొక్క తెవే నీవాలవైతివా
(॥పల్లవి॥)
అతని కొక్క తెవే నీవాలవైతివా
సతులందరును నీసాటివారేకారా
(॥అత॥)
గాదెఁబోసుకొనేవేమే గంపముంచి వలపులు
పోదిసేసి రమణునిపొంత నీవుండి
పాదుసేసి విత్తేవేమే పదనుతో నీసిగ్గులు
ఆదిగొని చన్నులు పయ్యదఁ గప్పికప్పి
(॥అత॥)
వెదచల్లే వదియేమే వెన్నెలవంటినవ్వులు
కొదరీర నీతనికొలువునను
తుదఁ బచారించేవేమే తొంగితొంగి నీచూపులు
చెదరిననీకొప్పు చేతఁ బెట్టుకొంటాను
(॥అత॥)
వొడిఁగట్టుకొనేవేమే వుబ్బరిసంతోసాలు
కడఁగి శ్రీవేంకటేశుకాఁగిటఁగూడి
నడుమ నీ వదియేమే నన్ను నీతఁ డిపు డేలె
అదరి యలమేల్ మంగనౌత నీవెఱఁగవా
(||pallavi||)
adani kŏkka tĕve nīvālavaidivā
sadulaṁdarunu nīsāḍivāregārā
(||ada||)
gādĕm̐bosugŏneveme gaṁpamuṁchi valabulu
podisesi ramaṇunibŏṁta nīvuṁḍi
pādusesi vitteveme padanudo nīsiggulu
ādigŏni sannulu payyadam̐ gappigappi
(||ada||)
vĕdasalle vadiyeme vĕnnĕlavaṁṭinavvulu
kŏdarīra nīdanigŏluvunanu
tudam̐ basāriṁcheveme tŏṁgidŏṁgi nīsūbulu
sĕdarinanīgŏppu sedam̐ bĕṭṭugŏṁṭānu
(||ada||)
vŏḍim̐gaṭṭugŏneveme vubbarisaṁtosālu
kaḍam̐gi śhrīveṁkaḍeśhugām̐giḍam̐gūḍi
naḍuma nī vadiyeme nannu nīdam̐ ḍibu ḍelĕ
adari yalamel maṁganauda nīvĕṟam̐gavā