Adani kivellaa nalavaadu

అతని కివెల్లా నలవాటు
Language

(॥పల్లవి॥)
అతని కివెల్లా నలవాటు
యితవులు చేసే యించుక నిలవే

(॥అత॥)
యెనసినమాఁటలె యెఱుకలు
మనసురానివే మఱపులు
తనిసితి మిఁక నింతటఁ బదవే! తనఁ
ననుపుఁ బ్రియములకు నవ్వితిఁగదవే

(॥అత॥)
కూరిమి గలచో కూటములు
వేరై తేనే వెడవెడలు
తారుకాణ లివె తడవకువే! తా
మేరమీరఁగా మెచ్చితి నిపుడే

(॥అత॥)
సమరులైతేఁ జవు లవును
అమరనివై తే నలపవును
క్రమమున శ్రీవేంకటపతి గూడెను
తమితో నే నిఁక దక్కితి నవునే

(||pallavi||)
adani kivĕllā nalavāḍu
yidavulu sese yiṁchuga nilave

(||ada||)
yĕnasinamām̐ṭalĕ yĕṟugalu
manasurānive maṟabulu
tanisidi mim̐ka niṁtaḍam̐ badave! tanam̐
nanubum̐ briyamulagu navvidim̐gadave

(||ada||)
kūrimi galaso kūḍamulu
verai tene vĕḍavĕḍalu
tārugāṇa livĕ taḍavaguve! tā
meramīram̐gā mĕchchidi nibuḍe

(||ada||)
samarulaidem̐ javu lavunu
amaranivai te nalabavunu
kramamuna śhrīveṁkaḍabadi gūḍĕnu
tamido ne nim̐ka dakkidi navune