Adani gadu lorula kalavadunaa

అతని గతు లొరుల కలవడునా
Language

(॥పల్లవి॥)
అతని గతు లొరుల కలవడునా
తతి నెటుచూచిన ధగధగ మెరుపు

(॥అత॥)
ముందర దెలియక మొదలు చేకొనక
గొందినే కూరిమి గొసరేవు
అదరివలెనా అతనిచిత్తము
యెందుచూచినా యింపులయెరపు

(॥అత॥)
రెప్పల నవ్వక రేసుల భ్రమయక
తప్పులె యెన్నెదు తమకమున
చెప్పుడురతు లాచెలువ లతనికే
కుప్పులు దెప్పులు కోరిక కొసరు

(॥అత॥)
ఘాతలు దియ్యక కసరులు దుయ్యక
ఆతఁడిట్ల నీకలవడునా
శ్రీతరుణీపతి శ్రీవేంకటపతి
యేతెరు వేఁగిన యేనుగవీధి

(||pallavi||)
adani gadu lŏrula kalavaḍunā
tadi nĕḍusūsina dhagadhaga mĕrubu

(||ada||)
muṁdara dĕliyaga mŏdalu segŏnaga
gŏṁdine kūrimi gŏsarevu
adarivalĕnā adanisittamu
yĕṁdusūsinā yiṁpulayĕrabu

(||ada||)
rĕppala navvaga resula bhramayaga
tappulĕ yĕnnĕdu tamagamuna
sĕppuḍuradu lāsĕluva ladanige
kuppulu dĕppulu koriga kŏsaru

(||ada||)
ghādalu diyyaga kasarulu duyyaga
ādam̐ḍiṭla nīgalavaḍunā
śhrīdaruṇībadi śhrīveṁkaḍabadi
yedĕru vem̐gina yenugavīdhi