Adani bhajiyimcharo aadumalaala shree

అతని భజియించరో ఆతుమలాల శ్రీ
Language

(॥పల్లవి॥)
అతని భజియించరో ఆతుమలాల శ్రీ-
పతి యితనికరుణే ఫలమింతే కాని

(॥అతని॥)
సంగమే భంగమే సుండి సకలవిరక్తులాల
వెంగలివిషయములే విషము సుండీ
అంగపుబందువులెల్ల అంటుబంధములు సుండీ
సంగతి హరి యెుక్కఁడే సతమింతేకాని

(॥అతని॥)
మోహమే దాహముసుండి మోక్షోపాయకులాల
సాహస సంసారమే నిస్సారము సుండి
దేహము గొన్నాళ్ళకు సందేహమై తోఁచు సుండి
శ్రీహరి సేవోక్కటే వచ్చినదింతేకాని

(॥అతని॥)
కోపమే తాపముసుండి కోరని సాత్వికులాల
రూపులేని భోగమెల్ల రుణము సుండి
కైపుసేసి యన్నిటాను గడిచిశ్రీవేంకటేశు-
నోపి శరణని మనేదక్కటే సుండి

(||pallavi||)
adani bhajiyiṁcharo ādumalāla śhrī-
padi yidanigaruṇe phalamiṁte kāni

(||adani||)
saṁgame bhaṁgame suṁḍi sagalaviraktulāla
vĕṁgaliviṣhayamule viṣhamu suṁḍī
aṁgabubaṁduvulĕlla aṁṭubaṁdhamulu suṁḍī
saṁgadi hari yĕుkkam̐ḍe sadamiṁtegāni

(||adani||)
mohame dāhamusuṁḍi mokṣhobāyagulāla
sāhasa saṁsārame nissāramu suṁḍi
dehamu gŏnnāḽḽagu saṁdehamai tom̐su suṁḍi
śhrīhari sevokkaḍe vachchinadiṁtegāni

(||adani||)
kobame tābamusuṁḍi korani sātvigulāla
rūbuleni bhogamĕlla ruṇamu suṁḍi
kaibusesi yanniḍānu gaḍisiśhrīveṁkaḍeśhu-
nobi śharaṇani manedakkaḍe suṁḍi