Adameemda nayinatlayyeem gaani

అటమీఁద నయినట్లయ్యీఁ గాని
Language

(॥పల్లవి॥)
అటమీఁద నయినట్లయ్యీఁ గాని
సట లింతే తాముఁ దామే సంతము లయ్యేరు

(॥ఆటమీఁద॥)
పలికినంతే చాలు పచ్చి సేయకురే యింతి
నలుక దేరినమీఁద నడిగేఁ గాని
చెలవుఁ డీసుద్ది వింటే చేర వచ్చునో రాడో
కలయిక కిద్దరినిఁ గదియింత మిపుడు

(॥అటమీఁద॥)
నవ్వినపాటే చాలు నానఁ బెట్టకురే మీరు
నెవ్వగ దీరితే బుద్ది నేనే చెప్పేను
అవ్వల నీపా టైతే నాతనిఁ దేరుచ రాదు
దవ్వుల నిద్దరి సమతారుకాణ నేతము

(॥అటమీఁద॥)
తానెచూచినంతే చాలు తరువుల వెట్టకురే
మేనులు సోఁకినమీద మించీఁ గాని
ఆనుక శ్రీవెంకటేశుఁ డలమేలుమంగఁ గూడె
పానిపట్టి యింతలోనే పంగింత మిపుడు

(||pallavi||)
aḍamīm̐da nayinaṭlayyīm̐ gāni
saḍa liṁte tāmum̐ dāme saṁtamu layyeru

(||āḍamīm̐da||)
paliginaṁte sālu pachchi seyagure yiṁti
naluga derinamīm̐da naḍigem̐ gāni
sĕlavum̐ ḍīsuddi viṁṭe sera vachchuno rāḍo
kalayiga kiddarinim̐ gadiyiṁta mibuḍu

(||aḍamīm̐da||)
navvinabāḍe sālu nānam̐ bĕṭṭagure mīru
nĕvvaga dīride buddi nene sĕppenu
avvala nībā ṭaide nādanim̐ derusa rādu
davvula niddari samadārugāṇa nedamu

(||aḍamīm̐da||)
tānĕsūsinaṁte sālu taruvula vĕṭṭagure
menulu som̐kinamīda miṁchīm̐ gāni
ānuga śhrīvĕṁkaḍeśhum̐ ḍalamelumaṁgam̐ gūḍĕ
pānibaṭṭi yiṁtalone paṁgiṁta mibuḍu