అటమీఁద మరి యేమి నావలలేదు సర్వ
(॥పల్లవి॥)
అటమీఁద మరి యేమి నావలలేదు సర్వ-
ఘటన లన్నియు హరిఁ గన్నదాఁకానే
(॥అట॥)
సరవితో వేదములు చదివేటి వెల్లాను
హరినామరుచి గన్నయందాఁకనే
సిరులతో యజ్ఞాలు సేసేటివెల్లాను
హరిసేవపరుఁడు దా నై నదాఁకానే
(॥అట॥)
చలపట్టి తీర్థాలు చరియించు టెల్లాను
వెలయఁగఁ గర్మాలు బడుదాఁకానే
మొలచిన తపముతో మునులై వుండే దెల్లా
తలఁపులో హరిరూపు తగులుదాఁకానే
(॥అట॥)
వేవేలుచందాల విజ్ఞాన మెల్లాను
కావించి హరిభక్తి కనుదాఁకానే
భావించే సకలోపాయము లెల్లాను
శ్రీవేంకటేశ్వరుఁ జేరుదాఁకనే
(||pallavi||)
aḍamīm̐da mari yemi nāvalaledu sarva-
ghaḍana lanniyu harim̐ gannadām̐kāne
(||aḍa||)
saravido vedamulu sadiveḍi vĕllānu
harināmarusi gannayaṁdām̐kane
sirulado yajñālu seseḍivĕllānu
harisevabarum̐ḍu dā nai nadām̐kāne
(||aḍa||)
salabaṭṭi tīrdhālu sariyiṁchu ṭĕllānu
vĕlayam̐gam̐ garmālu baḍudām̐kāne
mŏlasina tabamudo munulai vuṁḍe dĕllā
talam̐pulo harirūbu taguludām̐kāne
(||aḍa||)
vevelusaṁdāla vijñāna mĕllānu
kāviṁchi haribhakti kanudām̐kāne
bhāviṁche sagalobāyamu lĕllānu
śhrīveṁkaḍeśhvarum̐ jerudām̐kane