Adamdu yemi seseene amganalaala

అతఁడు యేమి సేసీనే అంగనలాల
Language

(॥పల్లవి॥)
అతఁడు యేమి సేసీనే అంగనలాల
చతురుఁడు పాదాలు చాఁచె నింతె మీపైని

(॥అతఁ॥)
చిప్పిల లోలోనే యెంత సిగ్గులువడేరే మీరు
దప్పిదేర మగనిపాదా లొత్తుతా
కొప్పులు జారఁగా యేమి కొంచి చూచేరే యతని
వుప్పటితిల్లుతమకాన వుమ్మగిలుతాను

(॥అతఁ॥)
నంటునను ముసిముసినవ్వులు యేల నవ్వేరే
జంటలై యితనివొద్ద సరిఁగూచుండి
అఁటిముట్టిసన్నల యేమాడుకొనేరే యతని
రెంటెముమరుగుతోనే రిచ్చలువడుతాను

(॥అతఁ॥)
చేకొని కూడి యెంతేసి చెమటలే కురిసేరే
జోకల వొకరొకరు చొక్కుకొంటాను
కైకొని మిమ్మేలె శ్రీ వేంకటాద్రి గోవిందరాజు
శ్రీ కాంతవు భూకాంతవు సేవలెన్ని సేసేరే

(||pallavi||)
adam̐ḍu yemi sesīne aṁganalāla
sadurum̐ḍu pādālu sām̐sĕ niṁtĕ mībaini

(||adam̐||)
sippila lolone yĕṁta sigguluvaḍere mīru
dappidera maganibādā lŏttudā
kŏppulu jāram̐gā yemi kŏṁchi sūsere yadani
vuppaḍidilludamagāna vummagiludānu

(||adam̐||)
naṁṭunanu musimusinavvulu yela navvere
jaṁṭalai yidanivŏdda sarim̐gūsuṁḍi
am̐ṭimuṭṭisannala yemāḍugŏnere yadani
rĕṁṭĕmumarugudone richchaluvaḍudānu

(||adam̐||)
segŏni kūḍi yĕṁtesi sĕmaḍale kurisere
jogala vŏgarŏgaru sŏkkugŏṁṭānu
kaigŏni mimmelĕ śhrī veṁkaḍādri goviṁdarāju
śhrī kāṁtavu bhūgāṁtavu sevalĕnni sesere