అతఁడు నేనుఁ గూచుండే అతివలందరుఁ గూడి
(॥పల్లవి॥)
అతఁడు నేనుఁ గూచుండే అతివలందరుఁ గూడి
చతురత నూడిగాలు సరసానఁ జేయరే
(॥అత॥)
కాయమెల్లాఁ జెమరించె గందవొడి చల్లరే
యేయెడనుండి వచ్చెనో యీతనికిని
చేయిచాఁచి నేనేమైనా సేవలు సేయఁగఁబోతే
చాయలకు సిగ్గువడీ సంగతిగా దిపుడు
(॥అతఁ॥)
మోవి గడువసివాడె మొక్కి విడెమియ్యరే
యీవేళకు నుచితము ఇతనికిని
కావించి యేమైనా నిచ్చకములు నేఁ జేయఁబోతే
భావించి తలవంచును భావ్యముగా దిపుడు
(॥అతఁ॥)
ఆంగమెల్లా బడలెను ఆరగించఁబెట్టిరే
ఇంగితపు శ్రీ వేంకటేశ్వరునికి
సంగతిగా సరి నే విన్నవించితే
వెంగలినవ్వులు నవ్వువేళలు గాదిపుడు
(||pallavi||)
adam̐ḍu nenum̐ gūsuṁḍe adivalaṁdarum̐ gūḍi
sadurada nūḍigālu sarasānam̐ jeyare
(||ada||)
kāyamĕllām̐ jĕmariṁchĕ gaṁdavŏḍi sallare
yeyĕḍanuṁḍi vachchĕno yīdanigini
seyisām̐si nenemainā sevalu seyam̐gam̐bode
sāyalagu sigguvaḍī saṁgadigā dibuḍu
(||adam̐||)
movi gaḍuvasivāḍĕ mŏkki viḍĕmiyyare
yīveḽagu nusidamu idanigini
kāviṁchi yemainā nichchagamulu nem̐ jeyam̐bode
bhāviṁchi talavaṁchunu bhāvyamugā dibuḍu
(||adam̐||)
āṁgamĕllā baḍalĕnu āragiṁcham̐bĕṭṭire
iṁgidabu śhrī veṁkaḍeśhvarunigi
saṁgadigā sari ne vinnaviṁchide
vĕṁgalinavvulu navvuveḽalu gādibuḍu