Adamdu lakshmeegaamtum danniyu nosamgum gaaga

అతఁడు లక్ష్మీకాంతుఁ డన్నియు నొసఁగుఁ గాక
Language

(॥పల్లవి॥)
అతఁడు లక్ష్మీకాంతుఁ డన్నియు నొసఁగుఁ గాక
యితరుల వేఁడుకొంటే నేమి గలదు

(॥అతఁ॥)
మోదముతో నొకమాని మొదలఁ బోసిన నీరు
పాదుకొని కొనకెక్కి ఫలించుఁగాక
ఆదిమూలమగుహరి నాతుమ సేవించక
యే దైవములఁగన్నా నేమి సెలవు

(॥అతఁ॥)
తల్లి భుజించినవెల్లా తగు గర్భము శిశువు-
కెల్లగాఁగఁ బరిణామ మిచ్చుఁగాక
వుల్లము లోపలి హరి కొసగని పూజలెల్లా
వెల్లిఁ జింతపంటివలె వృథా వృథా

(॥అతఁ॥)
వోలి నెంత జారిపడ్డా నూరకే యెవ్వరికైనా
నేలే యాధారమై నిలుచుఁగాక
తాలిమి శ్రీవేంకటేశుఁదలఁచక తలఁచినా
పాలించ నాతఁడేకాక పరులకు వశమా

(||pallavi||)
adam̐ḍu lakṣhmīgāṁtum̐ ḍanniyu nŏsam̐gum̐ gāga
yidarula vem̐ḍugŏṁṭe nemi galadu

(||adam̐||)
modamudo nŏgamāni mŏdalam̐ bosina nīru
pādugŏni kŏnagĕkki phaliṁchum̐gāga
ādimūlamaguhari nāduma seviṁchaga
ye daivamulam̐gannā nemi sĕlavu

(||adam̐||)
talli bhujiṁchinavĕllā tagu garbhamu śhiśhuvu-
kĕllagām̐gam̐ bariṇāma michchum̐gāga
vullamu lobali hari kŏsagani pūjalĕllā
vĕllim̐ jiṁtabaṁṭivalĕ vṛthā vṛthā

(||adam̐||)
voli nĕṁta jāribaḍḍā nūrage yĕvvarigainā
nele yādhāramai nilusum̐gāga
tālimi śhrīveṁkaḍeśhum̐dalam̐saga talam̐sinā
pāliṁcha nādam̐ḍegāga parulagu vaśhamā