అతఁడూ నీవూ నొక్కటే అండవారలే వేరు
(॥పల్లవి॥)
అతఁడూ నీవూ నొక్కటే అండవారలే వేరు
సతులతో నీ గుట్టు సారెఁ జూపేవు
(॥అత॥)
కప్పి నీవును నతఁడు కలహించినందుకును
కొప్పు వీడిన దిదియె గురుతు గాదా
చొప్పు లెత్తుచుఁ జెలులు సోదించి యడిగితే
అప్పటి లేదనుచు నాన వెట్టేవు
(॥అత॥)
యెలమిఁ జేపట్టులకు యిద్దరుఁ బెనఁగినందుఁ
కలసి పయ్యెడజారు టదియె గురుతు
లలి నూడిగపువారు తెలియ నిన్నడిగితే
పొలసి బొంకుచుఁ బతికి పూనుక వచ్చేవు
(॥అత॥)
పంతములు మీలోనఁ బచరించి నందుకును
రంతులను గురుతు లధరము నిండెను
వింతగా నిన్ను శ్రీ వేంకటేశుఁడు గూడె
సంతసంబులు మాకు చవులు చూపేవు
(||pallavi||)
adam̐ḍū nīvū nŏkkaḍe aṁḍavārale veru
sadulado nī guṭṭu sārĕm̐ jūbevu
(||ada||)
kappi nīvunu nadam̐ḍu kalahiṁchinaṁdugunu
kŏppu vīḍina didiyĕ gurudu gādā
sŏppu lĕttusum̐ jĕlulu sodiṁchi yaḍigide
appaḍi ledanusu nāna vĕṭṭevu
(||ada||)
yĕlamim̐ jebaṭṭulagu yiddarum̐ bĕnam̐ginaṁdum̐
kalasi payyĕḍajāru ṭadiyĕ gurudu
lali nūḍigabuvāru tĕliya ninnaḍigide
pŏlasi bŏṁkusum̐ badigi pūnuga vachchevu
(||ada||)
paṁtamulu mīlonam̐ basariṁchi naṁdugunu
raṁtulanu gurudu ladharamu niṁḍĕnu
viṁtagā ninnu śhrī veṁkaḍeśhum̐ḍu gūḍĕ
saṁtasaṁbulu māgu savulu sūbevu