Adamdekkada nunnaamdo adivalu naa keṟumgimchare

అతఁడెక్కడ నున్నాఁడో అతివలు నా కెఱుఁగించరే
Language

(॥పల్లవి॥)
అతఁడెక్కడ నున్నాఁడో అతివలు నా కెఱుఁగించరే
రతి కెక్కెను నా తమకము రాతిట నుండియును

(॥॥)
తలఁచిన నూరకు మదిలో దైవారీఁ దలపోఁతలు
పలికెద నంటే మానమే పరగీఁ బెదవులను
నిలిచెదనంటేఁ దొట్టీ నివ్వెరగులు నిలువుననే
చెలులాలా నా విరహము చెప్ప నలవిగాదే

(॥॥)
చూచిన నాతని రూపే సుడిసీ దిక్కుల నెల్లను
కాచుకు వున్నవి కాంక్షలు కన్నుల మీఁదటను
లాచీనిదివో పతి మేలపు మాటలు విన వీనులు
యా చందపు నా మోహం బెన్నఁ గొలఁది గాదే

(॥॥)
తడవిన నాతని పేరే తగిటీ నాలికె మీఁదను
పిడిచిన గారీ చెమటలు పిచ్చిలి చెక్కులను
తడయక శ్రీ వేంకటేశుఁ డు తా నిటు విచ్చేసి కూడెను
యెడయక సంతోషము నా కింతం తనరాదే

(||pallavi||)
adam̐ḍĕkkaḍa nunnām̐ḍo adivalu nā kĕṟum̐giṁchare
radi kĕkkĕnu nā tamagamu rādiḍa nuṁḍiyunu

(||||)
talam̐sina nūragu madilo daivārīm̐ dalabom̐talu
paligĕda naṁṭe māname paragīm̐ bĕdavulanu
nilisĕdanaṁṭem̐ dŏṭṭī nivvĕragulu niluvunane
sĕlulālā nā virahamu sĕppa nalavigāde

(||||)
sūsina nādani rūbe suḍisī dikkula nĕllanu
kāsugu vunnavi kāṁkṣhalu kannula mīm̐daḍanu
lāsīnidivo padi melabu māḍalu vina vīnulu
yā saṁdabu nā mohaṁ bĕnnam̐ gŏlam̐di gāde

(||||)
taḍavina nādani pere tagiḍī nāligĕ mīm̐danu
piḍisina gārī sĕmaḍalu pichchili sĕkkulanu
taḍayaga śhrī veṁkaḍeśhum̐ ḍu tā niḍu vichchesi kūḍĕnu
yĕḍayaga saṁtoṣhamu nā kiṁtaṁ tanarāde