అతఁడే యెఱుఁగునూ అన్ని సుద్దులు
(॥పల్లవి॥)
అతఁడే యెఱుఁగునూ అన్ని సుద్దులు
చేతిలోనిదాననని చెప్పరే విభునికి
(॥అతఁ॥)
దయగలవానికిఁ దప్పులెంచఁ జోటు లేదు
ప్రియపడేవానికి బిగియరాదు
నయగారివానిమతి నాఁటదు నిష్టూరము
క్రియ గూడఁదనకు మొక్కితి ననరే
(॥అతఁ॥)
తగులైన వానికి దండనుండి పాయరాదు
నగేవానికి పొంతనాలు గలవు
మొగమాడే వానిపై మోయ దపరాధము
అగపడితిఁ దనకు నాల ననరే
(॥అతఁ॥)
యేలినవానికి నేమెట్టున్నాఁ దనకుఁబోదు
లాలించేవానికి మొక్కలముదగదు
యీలీల శ్రీవేంకటేశుఁడిట్టె తానన్నుఁ గూడె
వేళావేళలఁదన్ను వేఁడుకొంటి ననరె
(||pallavi||)
adam̐ḍe yĕṟum̐gunū anni suddulu
sedilonidānanani sĕppare vibhunigi
(||adam̐||)
dayagalavānigim̐ dappulĕṁcham̐ joḍu ledu
priyabaḍevānigi bigiyarādu
nayagārivānimadi nām̐ṭadu niṣhṭūramu
kriya gūḍam̐danagu mŏkkidi nanare
(||adam̐||)
tagulaina vānigi daṁḍanuṁḍi pāyarādu
nagevānigi pŏṁtanālu galavu
mŏgamāḍe vānibai moya dabarādhamu
agabaḍidim̐ danagu nāla nanare
(||adam̐||)
yelinavānigi nemĕṭṭunnām̐ danagum̐bodu
lāliṁchevānigi mŏkkalamudagadu
yīlīla śhrīveṁkaḍeśhum̐ḍiṭṭĕ tānannum̐ gūḍĕ
veḽāveḽalam̐dannu vem̐ḍugŏṁṭi nanarĕ