అతఁడే గతి యంటి నన్నిటా మాన్యుఁడే
(॥పల్లవి॥)
అతఁడే గతి యంటి నన్నిటా మాన్యుఁడే
యితరములు మానఁగా నితనికే శలవు
(॥అతఁడే॥)
మీఱి శ్రీ రమణుని మెప్పించు సేవకులకు
వీఱిడి కర్మముల వెట్టి మాన్యము
ఆఱడి యితని భక్తులైన చనవరులకు
ఆఱితేరి పుణ్యపాపా లడ్డపాటి లేదు
(॥అతఁడే॥)
తక్కక యితని ముద్ర ధరించే దాసులకు
చొక్కుల భవబంధపు సుంకమాన్యము
లెక్కించి యితనికైన లెంకలకు జోడు కల
కొక్కట విధినిషేదా లూహింప లేవు
(॥అతఁడే॥)
సరుస శ్రీ వేంకటేశు శరణాగతులకును
పరగ మాయల దొడ్డి బందె మాన్యము
పరమైన యీతని పళ్లెము కూటివారికి
తరితో జగములోని తప్పొప్పులే లేవు
(||pallavi||)
adam̐ḍe gadi yaṁṭi nanniḍā mānyum̐ḍe
yidaramulu mānam̐gā nidanige śhalavu
(||adam̐ḍe||)
mīṟi śhrī ramaṇuni mĕppiṁchu sevagulagu
vīṟiḍi karmamula vĕṭṭi mānyamu
āṟaḍi yidani bhaktulaina sanavarulagu
āṟideri puṇyabābā laḍḍabāḍi ledu
(||adam̐ḍe||)
takkaga yidani mudra dhariṁche dāsulagu
sŏkkula bhavabaṁdhabu suṁkamānyamu
lĕkkiṁchi yidanigaina lĕṁkalagu joḍu kala
kŏkkaḍa vidhiniṣhedā lūhiṁpa levu
(||adam̐ḍe||)
sarusa śhrī veṁkaḍeśhu śharaṇāgadulagunu
paraga māyala dŏḍḍi baṁdĕ mānyamu
paramaina yīdani paḽlĕmu kūḍivārigi
tarido jagamuloni tappŏppule levu