అతఁ డెంత విలిసిన నలిగిరావు నీ
(॥పల్లవి॥)
అతఁ డెంత విలిసిన నలిగిరావు నీ-
కతమున నింకేమి గాఁగలదో
(॥అతఁ॥)
చూచినట్టు రాదు సూనసాయకుని
రాచకార్య మిది రమణి
ఱాచిలుకల గుఱ్ఱపుదళములు మించె
నేచె నిన్నిఁక నవి యేమనునో
(॥అతఁ॥)
తలఁచినట్టు రాదు తగ వసంతుని
బలమెంత గలదొ పడఁతి
నలువంకఁ గోవిల నల్లఁబనిగాదుసుమ్మీ
బలములు మోహరించెఁ బనిగాదుసుమ్మీ
(॥అతఁ॥)
కదిసినట్టు రాదుకడు శ్రీవేంకటేపతి
చిదుముగోరికొన చేకత్తుల
అదన నినుఁ గూడె అతనిబలముల
కెదిరి పలికితివి యిందాఁకాను
(||pallavi||)
adam̐ ḍĕṁta vilisina naligirāvu nī-
kadamuna niṁkemi gām̐galado
(||adam̐||)
sūsinaṭṭu rādu sūnasāyaguni
rāsagārya midi ramaṇi
ṟāsilugala guṭrabudaḽamulu miṁchĕ
nesĕ ninnim̐ka navi yemanuno
(||adam̐||)
talam̐sinaṭṭu rādu taga vasaṁtuni
balamĕṁta galadŏ paḍam̐ti
naluvaṁkam̐ govila nallam̐banigādusummī
balamulu mohariṁchĕm̐ banigādusummī
(||adam̐||)
kadisinaṭṭu rādugaḍu śhrīveṁkaḍebadi
sidumugorigŏna segattula
adana ninum̐ gūḍĕ adanibalamula
kĕdiri paligidivi yiṁdām̐kānu