Adadu naagum galamdanede saalu

అతడు నాకుఁ గలఁడనేదే చాలు
Language

(॥పల్లవి॥)
అతడు నాకుఁ గలఁడనేదే చాలు
చతురుని దూరకురే సారెసారె నిఁకను

(॥॥)
మలసి వేరొకతెకు మనసిచ్చునా అతఁడు
అలరి మాఁటలాడితే నాడుఁగాక
తలఁపు నామీఁద నుండు తను వెక్కుడ నుండినా
వలసినప్పుడు తానే వచ్చీ నాకడకు

(॥॥)
అటువలెఁ బరసతి కాసపడునా అతఁడు
నటనల నవ్వితేను నవ్వీఁగాక
యెటైనా నేనే యతఁడు యెవ్వ రేమిచెప్పినాను
తటుకనఁ దనమాఁట తప్పనివాఁ డతడు

(॥॥)
పక్కన నెవ్వరికైనా భ్రమసునా నేఁడతఁడు
చొక్కుఁగన్నులఁ జూచితేఁ జూచుఁగాక
యిక్కడ శ్రీవేంకటేశుఁ డింతలోనె నన్నుఁ గూడె
దక్కె నామతికే మతి తారుకాణ అతఁడు

(||pallavi||)
adaḍu nāgum̐ galam̐ḍanede sālu
saduruni dūragure sārĕsārĕ nim̐kanu

(||||)
malasi verŏgadĕgu manasichchunā adam̐ḍu
alari mām̐ṭalāḍide nāḍum̐gāga
talam̐pu nāmīm̐da nuṁḍu tanu vĕkkuḍa nuṁḍinā
valasinappuḍu tāne vachchī nāgaḍagu

(||||)
aḍuvalĕm̐ barasadi kāsabaḍunā adam̐ḍu
naḍanala navvidenu navvīm̐gāga
yĕḍainā nene yadam̐ḍu yĕvva remisĕppinānu
taḍuganam̐ danamām̐ṭa tappanivām̐ ḍadaḍu

(||||)
pakkana nĕvvarigainā bhramasunā nem̐ḍadam̐ḍu
sŏkkum̐gannulam̐ jūsidem̐ jūsum̐gāga
yikkaḍa śhrīveṁkaḍeśhum̐ ḍiṁtalonĕ nannum̐ gūḍĕ
dakkĕ nāmadige madi tārugāṇa adam̐ḍu