Achchamugaa shree harimka addamaada veṟadu

అచ్చముగా శ్రీ హరింక అడ్డమాడ వెఱతు
Language

(॥పల్లవి॥)
అచ్చముగా శ్రీ హరింక అడ్డమాడ వెఱతు
తెచ్చి నన్ను తిద్దుకొమ్మీ దేవుఁడ వీవు

(॥అచ్చము॥)
నెరుసు లెంచేనంటే నేనా నీకు నెదురు
కరుణించి వొకరీతిఁ గాతువు గాక
వొరగంట బంగారు వొరతురు గాని మరి
సరిగాఁ బెం కొరసితే సాటి వచ్చీనా

(॥అచ్చము॥)
మనసు సోదించేనంటే మంచివాఁడవా నేను
ఘనుఁడవు నీవు నన్నుఁ గాతువు గాక
పనికి వజ్రము సానఁ బట్టితే మిం చెక్కుఁ గాక
పెనుఁ బిడుక రాచితే పిప్పి గట్టదా

(॥అచ్చము॥)
మొక్కఁగా రక్షించేనంటే మొదల సుజ్ఞానినా
గక్కున శ్రీ వేంకటేశ కాతువు గాక
నిక్కి అద్దము దోమితే నీడ గానవచ్చుఁ గాక
ముక్కమూఁకుడు దోమితే మోము గానవచ్చునా

(||pallavi||)
achchamugā śhrī hariṁka aḍḍamāḍa vĕṟadu
tĕchchi nannu tiddugŏmmī devum̐ḍa vīvu

(||achchamu||)
nĕrusu lĕṁchenaṁṭe nenā nīgu nĕduru
karuṇiṁchi vŏgarīdim̐ gāduvu gāga
vŏragaṁṭa baṁgāru vŏraduru gāni mari
sarigām̐ bĕṁ kŏraside sāḍi vachchīnā

(||achchamu||)
manasu sodiṁchenaṁṭe maṁchivām̐ḍavā nenu
ghanum̐ḍavu nīvu nannum̐ gāduvu gāga
panigi vajramu sānam̐ baṭṭide miṁ sĕkkum̐ gāga
pĕnum̐ biḍuga rāside pippi gaṭṭadā

(||achchamu||)
mŏkkam̐gā rakṣhiṁchenaṁṭe mŏdala sujñāninā
gakkuna śhrī veṁkaḍeśha kāduvu gāga
nikki addamu domide nīḍa gānavachchum̐ gāga
mukkamūm̐kuḍu domide momu gānavachchunā