Abude neegu lonaidi nide nee

అపుడే నీకు లోనైతి నిదే నీ
Language

(॥పల్లవి॥)
అపుడే నీకు లోనైతి నిదే నీ-
రపమిఁక నా బీరము చెల్లీనా

(॥అపు॥)
తేటలమాటలఁ ద్రిపురాంగనలను
కూటువఁ గూడినకొనబలిమి
పాటైరుకుమిణి బలిమినె తెచ్చితి
గాఁటపునిను నేఁ గాదనఁగలనా

(॥అపు॥)
తిరముగ మందలఁదిరి గెడిమగువల
వెరవునఁ గూడినవిటుఁడవు
అరిదిఁ బదార్వేలతివల నేలిన
దొరవిటు చెనకినఁ దోయఁగఁగలనా

(॥అపు॥)
చలిమిని బలిమిని జలధికన్యనుఁ
గలసిన శ్రీవేంకటపతివి
మలసి నీవు నన్ను మన్ననఁ గూడితి
వెలమి నగించే వింతకుఁ గలనా

(||pallavi||)
abuḍe nīgu lonaidi nide nī-
rabamim̐ka nā bīramu sĕllīnā

(||abu||)
teḍalamāḍalam̐ driburāṁganalanu
kūḍuvam̐ gūḍinagŏnabalimi
pāḍairugumiṇi baliminĕ tĕchchidi
gām̐ṭabuninu nem̐ gādanam̐galanā

(||abu||)
tiramuga maṁdalam̐diri gĕḍimaguvala
vĕravunam̐ gūḍinaviḍum̐ḍavu
aridim̐ badārveladivala nelina
dŏraviḍu sĕnaginam̐ doyam̐gam̐galanā

(||abu||)
salimini balimini jaladhiganyanum̐
galasina śhrīveṁkaḍabadivi
malasi nīvu nannu mannanam̐ gūḍidi
vĕlami nagiṁche viṁtagum̐ galanā