అపుడే లోనైతి నీతో నడ్డమాడేనా! నీ
(॥పల్లవి॥)
అపుడే లోనైతి నీతో నడ్డమాడేనా! నీ-
రపమాయ మమ్ము నిఁక రవ్వసేయనేఁటికి
(॥అపు॥)
మనసొక్కటైతేఁ జాలు మాట లెట్టున్నా నేమి
కొనమొదలేల దిద్దుకొనేవు నీవు
పెనఁగి చూచితి నీతో ప్రియము చెప్పిఁ జూచితి
వెనకటి సుద్దులకు వేఁడుకొన నేఁటికి
(॥అపు॥)
ప్రియముగలితేఁ జాలు బిరుదులాడితే నేమి
క్రియెఱిఁగి ఇఁకనేల కిందుపడేవు
దయతోడ నుండితి నీదంటతనాన నుండితి
నియతపు నీసత్యాలు నెరపఁగ నేఁటికి
(॥అపు॥)
కూటమి గలితేఁ జాలు కొసరితేఁ దప్పేమి
మూటగట్టి మాకునేల మొక్కేవు నీవు
గాటపు శ్రీ వేంకటేశ కలసితి మెలసితి
పాటించి నీ బాసలు పచరించనేఁటికి
(||pallavi||)
abuḍe lonaidi nīdo naḍḍamāḍenā! nī-
rabamāya mammu nim̐ka ravvaseyanem̐ṭigi
(||abu||)
manasŏkkaḍaidem̐ jālu māḍa lĕṭṭunnā nemi
kŏnamŏdalela diddugŏnevu nīvu
pĕnam̐gi sūsidi nīdo priyamu sĕppim̐ jūsidi
vĕnagaḍi suddulagu vem̐ḍugŏna nem̐ṭigi
(||abu||)
priyamugalidem̐ jālu birudulāḍide nemi
kriyĕṟim̐gi im̐kanela kiṁdubaḍevu
dayadoḍa nuṁḍidi nīdaṁṭadanāna nuṁḍidi
niyadabu nīsatyālu nĕrabam̐ga nem̐ṭigi
(||abu||)
kūḍami galidem̐ jālu kŏsaridem̐ dappemi
mūḍagaṭṭi māgunela mŏkkevu nīvu
gāḍabu śhrī veṁkaḍeśha kalasidi mĕlasidi
pāḍiṁchi nī bāsalu pasariṁchanem̐ṭigi