Abburampu shishuvu aagumeemdi shishuvu

అబ్బురంపు శిశువు ఆకుమీఁది శిశువు
Language

(॥పల్లవి॥)
అబ్బురంపు శిశువు ఆకుమీఁది శిశువు
దొబ్బుడు రోలశిశువు త్ప్రువి త్ప్రువి త్ప్రువి

(॥అబ్బు॥)
పుట్టు శంఖుచక్రములఁ బుట్టిన యాశిశువు
పుట్టక తోల్లే మారుపుట్టువైన శిశువు
వొట్టుపక పాలువెన్నలు నోలలాడు శిశువు
తొట్టెలలోని శిశువు త్ప్రువి త్ప్రువి త్ప్రువి

(॥అబ్బు॥)
నిండిన బండి దన్నిన చిన్నిశిశువు
అండవారి మదమెల్ల నణఁచిన శిశువు
కొడలంతేశసురులఁ గొట్టిన యా శిశువు
దుండగంపు శిశువు త్ప్రువి త్ప్రువి త్ప్రువి

(॥అబ్బు॥)
వేఁగైన వేంకటగిరి వెలసిన శిశువు
కౌఁగిటి యిందిరా దొలఁగని శిశువు
ఆఁగి పాలజలధిలో నందమైన పెనుఁబాము
తూఁగుమంచము శిశువు త్ప్రువి త్ప్రువి త్ప్రువి

(||pallavi||)
abburaṁpu śhiśhuvu āgumīm̐di śhiśhuvu
dŏbbuḍu rolaśhiśhuvu tpruvi tpruvi tpruvi

(||abbu||)
puṭṭu śhaṁkhusakramulam̐ buṭṭina yāśhiśhuvu
puṭṭaga tolle mārubuṭṭuvaina śhiśhuvu
vŏṭṭubaga pāluvĕnnalu nolalāḍu śhiśhuvu
tŏṭṭĕlaloni śhiśhuvu tpruvi tpruvi tpruvi

(||abbu||)
niṁḍina baṁḍi dannina sinniśhiśhuvu
aṁḍavāri madamĕlla naṇam̐sina śhiśhuvu
kŏḍalaṁteśhasurulam̐ gŏṭṭina yā śhiśhuvu
duṁḍagaṁpu śhiśhuvu tpruvi tpruvi tpruvi

(||abbu||)
vem̐gaina veṁkaḍagiri vĕlasina śhiśhuvu
kaum̐giḍi yiṁdirā dŏlam̐gani śhiśhuvu
ām̐gi pālajaladhilo naṁdamaina pĕnum̐bāmu
tūm̐gumaṁchamu śhiśhuvu tpruvi tpruvi tpruvi