Abbe naagu nem damtadilone

అబ్బె నాకు నేఁ డంతటిలోనె
Language

(॥పల్లవి॥)
అబ్బె నాకు నేఁ డంతటిలోనె
సుబ్బనచూరల సూచన లిదివో

(॥అబ్బె॥)
పూచీ నౌనే పున్నమ వెన్నెల
చేచేతనే నీ సెలవులను
కాచె నిమ్మ లివె కడు నీ వురమున
పైచింతలనే పండెను మోవి

(॥అబ్బె॥)
మూఁగీ నౌనే మొకరితుమ్మిదలు
తూఁగేటి నీనెరి తురుమునను
రాఁగీఁ జిలుకలు రతి నీపలుకుల
ఆఁగీఁ బికములు అదె కుత్తికను

(॥అబ్బె॥)
పాఁకీ నౌనే బాహులతలు గడు
కాఁకల నీనాకాఁగిటను
యేఁకట శ్రీవేంకటేశుఁడఁ దియ్యఁగ
సోఁకీ మదనునిసొమ్ములు రతుల

(||pallavi||)
abbĕ nāgu nem̐ ḍaṁtaḍilonĕ
subbanasūrala sūsana lidivo

(||abbĕ||)
pūsī naune punnama vĕnnĕla
sesedane nī sĕlavulanu
kāsĕ nimma livĕ kaḍu nī vuramuna
paisiṁtalane paṁḍĕnu movi

(||abbĕ||)
mūm̐gī naune mŏgaridummidalu
tūm̐geḍi nīnĕri turumunanu
rām̐gīm̐ jilugalu radi nībalugula
ām̐gīm̐ bigamulu adĕ kuttiganu

(||abbĕ||)
pām̐kī naune bāhuladalu gaḍu
kām̐kala nīnāgām̐giḍanu
yem̐kaḍa śhrīveṁkaḍeśhum̐ḍam̐ diyyam̐ga
som̐kī madanunisŏmmulu radula