Aaye naayem jaalum jaalu natte kaadaa

ఆయె నాయెఁ జాలుఁ జాలు నట్టే కాదా
Language

(॥పల్లవి॥)
ఆయె నాయెఁ జాలుఁ జాలు నట్టే కాదా
ఆయెడ నీ మాట గన మట్టే కాదా

(॥ఆయె॥)
కందువనేఁ జూడఁగాను కాంతమోము చూచి నవ్వి
అందాలు చెప్పఁగ వచ్చే వట్టే కాదా
ముందు వెనకై యాకె మోవినే యా కందుకొని
అందుకు నానలు వెట్టే వట్టే కాదా

(॥ఆయె॥)
యింతవడి దాఁకా నీ వేడ నుంటివని యంటే
నంతలోనే వుస్సు రనేవు అట్టే కాదా
వంతువాసులకు తోడివనితనేఁ దిట్టితేను
అంతకుఁ బూనుక వచ్చేవు అట్టే కాదా

(॥ఆయె॥)
తప్పులు నీయందు మోపి తారుకాణించిన నన్ను
నప్పుడే కౌఁగిట నించే వట్టే కాదా
వొప్పగు శ్రీవేంకటేశ వుదుటు నీ మోహ మెల్లా
నప్పగించితివి నాకు నట్టే కాదా

(||pallavi||)
āyĕ nāyĕm̐ jālum̐ jālu naṭṭe kādā
āyĕḍa nī māḍa gana maṭṭe kādā

(||āyĕ||)
kaṁduvanem̐ jūḍam̐gānu kāṁtamomu sūsi navvi
aṁdālu sĕppam̐ga vachche vaṭṭe kādā
muṁdu vĕnagai yāgĕ movine yā kaṁdugŏni
aṁdugu nānalu vĕṭṭe vaṭṭe kādā

(||āyĕ||)
yiṁtavaḍi dām̐kā nī veḍa nuṁṭivani yaṁṭe
naṁtalone vussu ranevu aṭṭe kādā
vaṁtuvāsulagu toḍivanidanem̐ diṭṭidenu
aṁtagum̐ būnuga vachchevu aṭṭe kādā

(||āyĕ||)
tappulu nīyaṁdu mobi tārugāṇiṁchina nannu
nappuḍe kaum̐giḍa niṁche vaṭṭe kādā
vŏppagu śhrīveṁkaḍeśha vuduḍu nī moha mĕllā
nappagiṁchidivi nāgu naṭṭe kādā