ఆయనాయఁ జాలుఁజాలు అన్నియు నే నెఱఁగుదు
(॥పల్లవి॥)
ఆయనాయఁ జాలుఁజాలు అన్నియు నే నెఱఁగుదు
చాయలకు దిద్దుకొంటే చలిమే బలుములు
(॥ఆయ॥)
తేనెలమోవిమాట తీపులెక్కే వుండుఁగాక
వీనులకు యేమాడిన వింతదోఁచీనా
పూని అవి నీకుఁ జవి పోరచిసవతులకు
కానుకవట్టఁగఁ బోతే కారము లౌఁగాని
(॥ఆయ॥)
ననుపు చేతిసన్నలు నయమెక్కే వుండుఁగాక
వెనక నీమనసుకు వెగటయ్యీనా
పనికినచ్చు నీకవి పరసతులకునైతే
పెనగవెట్టఁబోతేను బిరుసెక్కుఁగాని
(॥ఆయ॥)
కడుకాఁగిటిచన్నులు గట్లయ్యే వుండుఁగాక
పొడవై నీరతులను పొల్లువొయ్యీనా
కడిమి శ్రీవేంకటేశ కలసితి వీకె, యాడోఁ
పడఁతుల కెల్లానైతే పచ్చిదోఁచుఁగాని
(||pallavi||)
āyanāyam̐ jālum̐jālu anniyu ne nĕṟam̐gudu
sāyalagu diddugŏṁṭe salime balumulu
(||āya||)
tenĕlamovimāḍa tībulĕkke vuṁḍum̐gāga
vīnulagu yemāḍina viṁtadom̐sīnā
pūni avi nīgum̐ javi porasisavadulagu
kānugavaṭṭam̐gam̐ bode kāramu laum̐gāni
(||āya||)
nanubu sedisannalu nayamĕkke vuṁḍum̐gāga
vĕnaga nīmanasugu vĕgaḍayyīnā
paniginachchu nīgavi parasadulagunaide
pĕnagavĕṭṭam̐bodenu birusĕkkum̐gāni
(||āya||)
kaḍugām̐giḍisannulu gaṭlayye vuṁḍum̐gāga
pŏḍavai nīradulanu pŏlluvŏyyīnā
kaḍimi śhrīveṁkaḍeśha kalasidi vīgĕ, yāḍom̐
paḍam̐tula kĕllānaide pachchidom̐sum̐gāni