ఆయనాయఁ జాలుఁ జాలు అంత మాకేల
(॥పల్లవి॥)
ఆయనాయఁ జాలుఁ జాలు అంత మాకేల
పాయక సవతులకు పంతములు రేఁగవా
(॥ఆయ॥)
ననిచిన చెలి నీతో నవ్వులు నవ్వెనంటా
పనివడి మమ్ము నవ్వఁ బాలుపెట్టేవు
వెనుకొని నీకునంత వేడుకైతే నాయఁగాక
గునిసే సవతులకు కోపములు రేఁగవా
(॥ఆయ॥)
చెలియ నీమాటలకు శిరసు వూఁచీనంటా
వొలిసి మమ్మును శిరసూఁచుమనేవు
వలసిన నీకు నివి వైపైతే నాయఁగాక
పెలుచు సవతులకు బిగువులు వట్టవా
(॥ఆయ॥)
అంగన నీవోజలకు నట్టె చొక్కీనంటా
సుంగుల మమ్మూ నట్టె చొక్కుమనేవు
ముంగిట శ్రీ వేంకటేశ ముంచి నన్నుఁ గూడితివి
వెంగలి సవతులకు విరహాలు నిండవా
(||pallavi||)
āyanāyam̐ jālum̐ jālu aṁta māgela
pāyaga savadulagu paṁtamulu rem̐gavā
(||āya||)
nanisina sĕli nīdo navvulu navvĕnaṁṭā
panivaḍi mammu navvam̐ bālubĕṭṭevu
vĕnugŏni nīgunaṁta veḍugaide nāyam̐gāga
gunise savadulagu kobamulu rem̐gavā
(||āya||)
sĕliya nīmāḍalagu śhirasu vūm̐sīnaṁṭā
vŏlisi mammunu śhirasūm̐sumanevu
valasina nīgu nivi vaibaide nāyam̐gāga
pĕlusu savadulagu biguvulu vaṭṭavā
(||āya||)
aṁgana nīvojalagu naṭṭĕ sŏkkīnaṁṭā
suṁgula mammū naṭṭĕ sŏkkumanevu
muṁgiḍa śhrī veṁkaḍeśha muṁchi nannum̐ gūḍidivi
vĕṁgali savadulagu virahālu niṁḍavā