Aayanaayam danisidi mannidaanu

ఆయనాయఁ దనిసితి మన్నిటాను
Language

(॥పల్లవి॥)
ఆయనాయఁ దనిసితి మన్నిటాను
యీయెడ నీ వోజలు యెఱఁగమా తొల్లి

(॥॥)
యెన్నిసుద్దులు చెప్పేవు ఇచ్చక మెంత సేసేవు
వున్నతి నిందాఁకా నెందోవుండి వచ్చి
సన్నలేల చూపేవు సరస మేమాడేవు
యిన్నేసి నీవేసాలు యెరఁగమా నేము

(॥॥)
నవ్వు లెందాఁకా నవ్వేవు నయ మెట్టు గురిసేవు
యెవ్వరెవ్వరికో కాఁగిలిచ్చి వచ్చి
పువ్వు లెక్కడి విచ్చేవు పూసేవు గంద మప్పటిఁ
నివ్వల నీమతకము లెఱఁగమా నేము

(॥॥)
కుచము లేలంటేవు గోరెంత దీసేవు
పచరించే వెవ్వతెతోనో పలికి వచ్చి
రుచులుగాఁ గూడితివి రొక్కము శ్రీ వేంకటేశ
ఇచట నీవినోదాలు యెఱఁగమా నేము

(||pallavi||)
āyanāyam̐ danisidi manniḍānu
yīyĕḍa nī vojalu yĕṟam̐gamā tŏlli

(||||)
yĕnnisuddulu sĕppevu ichchaga mĕṁta sesevu
vunnadi niṁdām̐kā nĕṁdovuṁḍi vachchi
sannalela sūbevu sarasa memāḍevu
yinnesi nīvesālu yĕram̐gamā nemu

(||||)
navvu lĕṁdām̐kā navvevu naya mĕṭṭu gurisevu
yĕvvarĕvvarigo kām̐gilichchi vachchi
puvvu lĕkkaḍi vichchevu pūsevu gaṁda mappaḍim̐
nivvala nīmadagamu lĕṟam̐gamā nemu

(||||)
kusamu lelaṁṭevu gorĕṁta dīsevu
pasariṁche vĕvvadĕdono paligi vachchi
rusulugām̐ gūḍidivi rŏkkamu śhrī veṁkaḍeśha
isaḍa nīvinodālu yĕṟam̐gamā nemu