Aayanaayam badabada atte tannu rammanave

ఆయనాయఁ బదపద అట్టె తన్ను రమ్మనవే
Language

(॥పల్లవి॥)
ఆయనాయఁ బదపద అట్టె తన్ను రమ్మనవే
దాయగాఁ డెట్టైన నాడు తనకేమి యనవే

(॥ఆయ॥)
పడఁతులనెల్లఁ గూడి బమ్మచారి ననుకొనె
జడియక తాను సత్యసందుఁడుగదె
బడి బడి మాతోను బాసలు సేయక తాను
విడిచినా అటువంటివియే కాదా ఇఁకను

(॥ఆయ॥)
పనులన్నిటిఁ గాచి పట్టపురాజాయ తాను
దెసల నీపనులకు దేవరగదే
యెసఁగి మమ్మెల్ల నిట్టె యేలక తా మానీనా
కొసరితే ఇక్కడా నాగుణమేకదే

(॥ఆయ॥)
వెన్నలెల్లా దొంగిలి శ్రీవేంకటేశుఁడైనాడు
వున్నతి దనకుఁ గలవోజేకదే
మన్నించి నన్నిట్టె కూడె మనసు తాఁబట్టెనా
యెన్నికలు మాయెడకు యిట్టి వేకదవే

(||pallavi||)
āyanāyam̐ badabada aṭṭĕ tannu rammanave
dāyagām̐ ḍĕṭṭaina nāḍu tanagemi yanave

(||āya||)
paḍam̐tulanĕllam̐ gūḍi bammasāri nanugŏnĕ
jaḍiyaga tānu satyasaṁdum̐ḍugadĕ
baḍi baḍi mādonu bāsalu seyaga tānu
viḍisinā aḍuvaṁṭiviye kādā im̐kanu

(||āya||)
panulanniḍim̐ gāsi paṭṭaburājāya tānu
dĕsala nībanulagu devaragade
yĕsam̐gi mammĕlla niṭṭĕ yelaga tā mānīnā
kŏsaride ikkaḍā nāguṇamegade

(||āya||)
vĕnnalĕllā dŏṁgili śhrīveṁkaḍeśhum̐ḍaināḍu
vunnadi danagum̐ galavojegade
manniṁchi nanniṭṭĕ kūḍĕ manasu tām̐baṭṭĕnā
yĕnnigalu māyĕḍagu yiṭṭi vegadave