Aayanaaya yimda veede mamdugovayyaa

ఆయనాయ యింద వీడె మందుకోవయ్యా
Language

(॥పల్లవి॥)
ఆయనాయ యింద వీడె మందుకోవయ్యా
యీయెడ నీ మాయలు యేల సేసే విఁకను

(॥ఆయ॥)
సన్న సేసినవాఁడవు సారెఁగాచుకుందు గాక
వన్నెలఁ బిలిపించుకోవలెనా నీకు
అన్నిటా నేలినవాఁడ వండఁ గూచుందవు గాక
యేన్నేసిపరాకులు యెంతసేసే విపుడు

(॥ఆయ॥)
నవ్వినట్టివాఁడవు నను పేసేతువు గాక
పవ్వళించివుండ నింతపంతమా నీకు
రవ్వసేసినవాఁడవు రతికే వత్తువు గాక
యెవ్వరికిఁ దరితీపు లేలసేసే విఁకను

(॥ఆయ॥)
చెక్కునొక్కినవాఁడవు సేసవెట్టుదువు గాక
వెక్కసాన మే మఱవ వేడుకా నీకు
తక్కక శ్రీ వేంకటేశ తగ నన్నుఁ గూడితివి
యిక్కువంటి అప్పటి నన్నేమడిగే విపుడు

(||pallavi||)
āyanāya yiṁda vīḍĕ maṁdugovayyā
yīyĕḍa nī māyalu yela sese vim̐kanu

(||āya||)
sanna sesinavām̐ḍavu sārĕm̐gāsuguṁdu gāga
vannĕlam̐ bilibiṁchugovalĕnā nīgu
anniḍā nelinavām̐ḍa vaṁḍam̐ gūsuṁdavu gāga
yennesibarāgulu yĕṁtasese vibuḍu

(||āya||)
navvinaṭṭivām̐ḍavu nanu peseduvu gāga
pavvaḽiṁchivuṁḍa niṁtabaṁtamā nīgu
ravvasesinavām̐ḍavu radige vattuvu gāga
yĕvvarigim̐ daridību lelasese vim̐kanu

(||āya||)
sĕkkunŏkkinavām̐ḍavu sesavĕṭṭuduvu gāga
vĕkkasāna me maṟava veḍugā nīgu
takkaga śhrī veṁkaḍeśha taga nannum̐ gūḍidivi
yikkuvaṁṭi appaḍi nannemaḍige vibuḍu