ఆయనాయ వొద్దులేవే అలసితివి
(॥పల్లవి॥)
ఆయనాయ వొద్దులేవే అలసితివి
రాయడించీఁ జన్నుదోయి రవ్వయ్యీ నుండవే
(॥ఆయ॥)
తగవులు చెప్పనేలే తగ నాతనికి నాకు
నగవులు నగనేలే నడుమ నీవు
యెగసక్కేలాడనేలే యింతలోనే వేగిరించి
దగ దొట్టిఁ జాలుఁజాలు తతి నూరకుండవే
(॥ఆయ॥)
వాసులు వుట్టించనేలే వడి నాతనికి నాకు
మోసాలు చూపనేలే మొక్కలానను
వేసాలు సేయనేలే వేమారు నన్నుఁ జూచి
ఆసలఁ జెమట రేఁగీ నట్టె వూరకుండవే
(॥ఆయ॥)
సాకిరిచెప్పఁగనేలే సరి మాయిద్దరిలోన
ఆకడ నాడుకోనేలే అందరితోడ
పైకొని శ్రీవేంకటపతి నన్ను నిట్టె కూడె
చీకాకుగాఁ గొప్పువడీ సిగ్గుతోడ నుండవే
(||pallavi||)
āyanāya vŏdduleve alasidivi
rāyaḍiṁchīm̐ jannudoyi ravvayyī nuṁḍave
(||āya||)
tagavulu sĕppanele taga nādanigi nāgu
nagavulu naganele naḍuma nīvu
yĕgasakkelāḍanele yiṁtalone vegiriṁchi
daga dŏṭṭim̐ jālum̐jālu tadi nūraguṁḍave
(||āya||)
vāsulu vuṭṭiṁchanele vaḍi nādanigi nāgu
mosālu sūbanele mŏkkalānanu
vesālu seyanele vemāru nannum̐ jūsi
āsalam̐ jĕmaḍa rem̐gī naṭṭĕ vūraguṁḍave
(||āya||)
sāgirisĕppam̐ganele sari māyiddarilona
āgaḍa nāḍugonele aṁdaridoḍa
paigŏni śhrīveṁkaḍabadi nannu niṭṭĕ kūḍĕ
sīgāgugām̐ gŏppuvaḍī siggudoḍa nuṁḍave