(॥పల్లవి॥)
ఆయనాయ చాలుఁజాలు అంతసేయకు
నాయములఁ బెట్టి నిన్ను నవ్వించజాలనా
(॥ఆయ॥)
సిగ్గున నూరక చెక్కు చేతితో నుంటిఁగాక
దగ్గరి మాటాడ నిన్నుఁ దడవా నాకు
వెగ్గళించి నీమాట వేలుచుకొనుచుంటిఁగాక
యెగ్గులెంచి వొలవేయ నెంతకైనా నేరనా
(॥ఆయ॥)
సారె సారెఁ గన్నుల నీసరిత చూచితిఁగాక
తారుకాణలకుఁ దియ్య దడవా నాకు
గారవపు నీమోము కన్నదాఁకా నుంటిఁగాక
బీరమాడి నీతో నింత పెనఁగనోపనా
(॥ఆయ॥)
నిలుచుండి నీచేఁతకు నివ్వెరగందితిఁగాక
తలఁపెల్లఁ దెలియ గఁ దడవా నాకు
బలిమి శ్రీవేంకటేశ పాయకిట్టె కూడితివి
అలమేలుమంగను నే నంత నేరనా
(||pallavi||)
āyanāya sālum̐jālu aṁtaseyagu
nāyamulam̐ bĕṭṭi ninnu navviṁchajālanā
(||āya||)
sigguna nūraga sĕkku sedido nuṁṭim̐gāga
daggari māḍāḍa ninnum̐ daḍavā nāgu
vĕggaḽiṁchi nīmāḍa velusugŏnusuṁṭim̐gāga
yĕggulĕṁchi vŏlaveya nĕṁtagainā neranā
(||āya||)
sārĕ sārĕm̐ gannula nīsarida sūsidim̐gāga
tārugāṇalagum̐ diyya daḍavā nāgu
gāravabu nīmomu kannadām̐kā nuṁṭim̐gāga
bīramāḍi nīdo niṁta pĕnam̐ganobanā
(||āya||)
nilusuṁḍi nīsem̐tagu nivvĕragaṁdidim̐gāga
talam̐pĕllam̐ dĕliya gam̐ daḍavā nāgu
balimi śhrīveṁkaḍeśha pāyagiṭṭĕ kūḍidivi
alamelumaṁganu ne naṁta neranā