Aayanaaya raavayyaa amdugu nem gaadanenaa

ఆయనాయ రావయ్యా అందుకు నేఁ గాదనేనా
Language

(॥పల్లవి॥)
ఆయనాయ రావయ్యా అందుకు నేఁ గాదనేనా
పాయరాని పొందులకు పంతాలాడనేఁటికి

(॥ఆయ॥)
చెప్పినయాపెమాటలు చెవులొగ్గి వింటివి
కుప్పళించఁ జెమటలు గురిసె మేన
ముప్పిరిగొనె నవ్వులు మోహములు దైవారె
చొప్పులెల్లాఁ గంటిమి సుద్దు లింకా వలెనా

(॥ఆయ॥)
చన్నులాపె దాఁకించఁగా సాములు సేసితివి
తన్నుఁదానే చొక్కి నీచిత్తము గరఁగె
కన్నులసన్నలు మించె కలిగె మోముకళలు
పన్నుగడలాయ నొడఁబరచఁగవలెనా

(॥ఆయ॥)
గక్కన నాపెచేతికికానుక లందుకొంటివి
చెక్కులపై పులకలు చిమ్మిరేఁగెను
యిక్కడ శ్రీవేంకటేశ యేలితివి నన్నప్పటి
దక్కె నీమన్ననలెల్లా తారుకాణ వలెనా

(||pallavi||)
āyanāya rāvayyā aṁdugu nem̐ gādanenā
pāyarāni pŏṁdulagu paṁtālāḍanem̐ṭigi

(||āya||)
sĕppinayābĕmāḍalu sĕvulŏggi viṁṭivi
kuppaḽiṁcham̐ jĕmaḍalu gurisĕ mena
muppirigŏnĕ navvulu mohamulu daivārĕ
sŏppulĕllām̐ gaṁṭimi suddu liṁkā valĕnā

(||āya||)
sannulābĕ dām̐kiṁcham̐gā sāmulu sesidivi
tannum̐dāne sŏkki nīsittamu garam̐gĕ
kannulasannalu miṁchĕ kaligĕ momugaḽalu
pannugaḍalāya nŏḍam̐barasam̐gavalĕnā

(||āya||)
gakkana nābĕsedigigānuga laṁdugŏṁṭivi
sĕkkulabai pulagalu simmirem̐gĕnu
yikkaḍa śhrīveṁkaḍeśha yelidivi nannappaḍi
dakkĕ nīmannanalĕllā tārugāṇa valĕnā