Aayanaaya raavayya amganavaddigi nemdu

ఆయనాయ రావయ్య అంగనవద్దికి నేఁడు
Language

(॥పల్లవి॥)
ఆయనాయ రావయ్య అంగనవద్దికి నేఁడు
పాయపు నీ దేవి యింత బాఁతిపడఁగాను

(॥ఆయ॥)
మాటలెన్ని లేవు మాపుదాఁకా నాడితేను
కూటమి నీమన్ననలే గుఱుతుగాక
నే(నేఁ?) టనెతప్పెనా నీనేరుపులేపచరించ
అఁటది నీవిరహాన నట్లుండఁగాను

(॥ఆయ॥)
నవ్వు లెన్ని లేవు ననుపులు జరపితే
యివ్వలఁ గరుణించుటే యెన్నికెగాక
రవ్వగా నిందువంకనా రాజసము నిలిపేది
జవ్వని నీయాసల లోఁగఁగాను

(॥ఆయ॥)
మొక్కు లెన్ని లేవు మోపులుగాఁ గట్టితేను
యిక్కువ నిట్టె కూడిన దెక్కుడుగాక
నిక్కము శ్రీవేంకటేశ నీజాడ లిట్లానా
చక్కనమ్మ నీపొందు సారెఁ జేయఁగాను

(||pallavi||)
āyanāya rāvayya aṁganavaddigi nem̐ḍu
pāyabu nī devi yiṁta bām̐tibaḍam̐gānu

(||āya||)
māḍalĕnni levu mābudām̐kā nāḍidenu
kūḍami nīmannanale guṟudugāga
ne(nem̐?) ṭanĕdappĕnā nīnerubulebasariṁcha
am̐ṭadi nīvirahāna naṭluṁḍam̐gānu

(||āya||)
navvu lĕnni levu nanubulu jarabide
yivvalam̐ garuṇiṁchuḍe yĕnnigĕgāga
ravvagā niṁduvaṁkanā rājasamu nilibedi
javvani nīyāsala lom̐gam̐gānu

(||āya||)
mŏkku lĕnni levu mobulugām̐ gaṭṭidenu
yikkuva niṭṭĕ kūḍina dĕkkuḍugāga
nikkamu śhrīveṁkaḍeśha nījāḍa liṭlānā
sakkanamma nībŏṁdu sārĕm̐ jeyam̐gānu