ఆయనాయ రావయ్య అంగనతోఁ గూడవయ్య
(॥పల్లవి॥)
ఆయనాయ రావయ్య అంగనతోఁ గూడవయ్య
కాయజకేలిని వొక్కకత చెప్పవయ్యా
(॥ఆయ॥)
పువ్వువంటివలపు బుజముల దాఁకా మోఁచి
జవ్వనికుచములై జడిసీనిదె
నవ్వులనే పిండిరాలి నాములు చూపులఁ బారి
ఇవ్వల రచ్చల సేసే విది యేఁటిదయ్యా
(॥ఆయ॥)
చిగురువంటి మదము చెంపలవెంటా జారి
మగువకుఁ దురుమై మలసీనదె
వొగరు చెమటై వెళ్లి వుదుట పులక లుబ్బి
యెగసక్కేలేల చూపే విది యేఁటిదయ్యా
(॥ఆయ॥)
పండులవంటిరతుల పొగరు మెగానకుబ్బి
దిండు కట్టి చెలిమోవై తేనెగారీని
అండనె శ్రీ వేంకటేశ ఆయమంటి కూడితివి
యిండులెల్లా నిండెఁ దమి ఇఁక నేఁటిదయ్యా
(||pallavi||)
āyanāya rāvayya aṁganadom̐ gūḍavayya
kāyajagelini vŏkkagada sĕppavayyā
(||āya||)
puvvuvaṁṭivalabu bujamula dām̐kā mom̐si
javvanigusamulai jaḍisīnidĕ
navvulane piṁḍirāli nāmulu sūbulam̐ bāri
ivvala rachchala sese vidi yem̐ṭidayyā
(||āya||)
siguruvaṁṭi madamu sĕṁpalavĕṁṭā jāri
maguvagum̐ durumai malasīnadĕ
vŏgaru sĕmaḍai vĕḽli vuduḍa pulaga lubbi
yĕgasakkelela sūbe vidi yem̐ṭidayyā
(||āya||)
paṁḍulavaṁṭiradula pŏgaru mĕgānagubbi
diṁḍu kaṭṭi sĕlimovai tenĕgārīni
aṁḍanĕ śhrī veṁkaḍeśha āyamaṁṭi kūḍidivi
yiṁḍulĕllā niṁḍĕm̐ dami im̐ka nem̐ṭidayyā