Aayanaaya numdavayyaa annidaa samtosimchidi

ఆయనాయ నుండవయ్యా అన్నిటా సంతోసించితి
Language

(॥పల్లవి॥)
ఆయనాయ నుండవయ్యా అన్నిటా సంతోసించితి
నాయము లింకా నెంత నడపేవు నీవు

(॥అయ॥)
మాటలాడనేరిచినమగ వానితోడుత
అఁటది సారెకు నెదురాడఁగలదా
వాఁటపునీవనితలు వద్దనే కాచుకున్నారు
యేఁటికి దొంతులువెట్టే వేడలేనిసుద్దులు

(॥అయ॥)
మిక్కిలిజాణతనాలుమెరఇంచే వానితో
మక్కువైనమానాపతి మారుకొనీనా
వెక్కసపునీగుణాలు వీనుల నిండెను మాకు
చక్కటువేల దిద్దేవు సరుస నీచేఁతలు

(॥అయ॥)
ఆనవెట్టి నమ్మించి ఆసకొలిపేనీతోను
దానికి మాబోంట్లు జవదాఁటవచ్చునా
యీనెపాన శ్రీవేంకటేశ నన్ను నేలితివి
కానీలే యే(యీ?) గతి నిఁడె కరుణ నామీఁదను

(||pallavi||)
āyanāya nuṁḍavayyā anniḍā saṁtosiṁchidi
nāyamu liṁkā nĕṁta naḍabevu nīvu

(||aya||)
māḍalāḍanerisinamaga vānidoḍuda
am̐ṭadi sārĕgu nĕdurāḍam̐galadā
vām̐ṭabunīvanidalu vaddane kāsugunnāru
yem̐ṭigi dŏṁtuluvĕṭṭe veḍalenisuddulu

(||aya||)
mikkilijāṇadanālumĕra̮iṁche vānido
makkuvainamānābadi mārugŏnīnā
vĕkkasabunīguṇālu vīnula niṁḍĕnu māgu
sakkaḍuvela diddevu sarusa nīsem̐talu

(||aya||)
ānavĕṭṭi nammiṁchi āsagŏlibenīdonu
dānigi māboṁṭlu javadām̐ṭavachchunā
yīnĕbāna śhrīveṁkaḍeśha nannu nelidivi
kānīle ye(yī?) gadi nim̐ḍĕ karuṇa nāmīm̐danu