ఆయనాయ నుండవయ్య అన్నిటా నేరుపరివి
(॥పల్లవి॥)
ఆయనాయ నుండవయ్య అన్నిటా నేరుపరివి
పాయము పెచ్చువెరిగీఁ బలుకులలోనను
(॥ఆయ॥)
గందపుఁబూఁతబేంట్లు కస్తూరివాట్లు
చిందిచింది రాలిరాలి చిట్లఁజొచ్చె
యెందాఁకా నవ్వు నవ్వే విందరుఁ జూచేరు నిన్ను
చెం(చెం?) జెమటలు నీచెక్కుల వెంటాను
(॥ఆయ॥)
మించుఁగొప్పువిరులు మెడనున్న సరులు
పొంచిపొంచి చెదరుచుఁ బొనుఁగఁజొచ్చె
యెంచరాని మాటలెల్ల యెందాఁకా నాడేవు
ముంచీ నిట్టూర్పులు ముక్కునిండాను
(॥ఆయ॥)
కంకణాలమోఁతలు కాఁగిటిలో చేఁతలు
పొంకపు శ్రీవేంకటేశ పొలయఁజొచ్చె
కొంకన నన్నే లితివి గుటెందాఁకాఁ జేసేవు
అంకెలఁ దేనెలుగారీ నధరమునిండను
(||pallavi||)
āyanāya nuṁḍavayya anniḍā nerubarivi
pāyamu pĕchchuvĕrigīm̐ balugulalonanu
(||āya||)
gaṁdabum̐būm̐tabeṁṭlu kastūrivāṭlu
siṁdisiṁdi rālirāli siṭlam̐jŏchchĕ
yĕṁdām̐kā navvu navve viṁdarum̐ jūseru ninnu
sĕṁ(sĕṁ?) jĕmaḍalu nīsĕkkula vĕṁṭānu
(||āya||)
miṁchum̐gŏppuvirulu mĕḍanunna sarulu
pŏṁchibŏṁchi sĕdarusum̐ bŏnum̐gam̐jŏchchĕ
yĕṁcharāni māḍalĕlla yĕṁdām̐kā nāḍevu
muṁchī niṭṭūrbulu mukkuniṁḍānu
(||āya||)
kaṁkaṇālamom̐talu kām̐giḍilo sem̐talu
pŏṁkabu śhrīveṁkaḍeśha pŏlayam̐jŏchchĕ
kŏṁkana nanne lidivi guḍĕṁdām̐kām̐ jesevu
aṁkĕlam̐ denĕlugārī nadharamuniṁḍanu