Aayanaaya numdavayya alasidivi

ఆయనాయ నుండవయ్య అలసితివి
Language

(॥పల్లవి॥)
ఆయనాయ నుండవయ్య అలసితివి
చేయిమీఁదుగా నన్నుఁ జెనకేవు ఇపుడు

(॥॥)
వెలి నింతలో నొక్క వెలదిఁకాఁగిట నుండి
కలలోన నొకకాంతఁ గలతువు
యెలమి నీయాసోద మేమిచెప్పే దప్పటిని
కొలఁదిమీరఁగ నాకొంగువట్టే విపుడు

(॥॥)
శిర సీవలఁ బెట్టుక చెలితో మాటాడుతానే
తెరలో నొక్కతెఁ గూడి కెరలింతువు
గొరబులుగానీ నీగుణము లెట్టు గనేది
సరి నాపై నిదివో సేసలు చల్లే విపుడు

(॥॥)
వెలయ భూకాంతను వీఁపునను మోచుకొని
ఆలమేలుమంగ నురమందు మోచేవు
తెలిసి శ్రీ వేంకటేశ దేవిగా నన్నేలితివి
వలెనని మువ్వంకలా వలచితి విపుడు

(||pallavi||)
āyanāya nuṁḍavayya alasidivi
seyimīm̐dugā nannum̐ jĕnagevu ibuḍu

(||||)
vĕli niṁtalo nŏkka vĕladim̐kām̐giḍa nuṁḍi
kalalona nŏgagāṁtam̐ galaduvu
yĕlami nīyāsoda memisĕppe dappaḍini
kŏlam̐dimīram̐ga nāgŏṁguvaṭṭe vibuḍu

(||||)
śhira sīvalam̐ bĕṭṭuga sĕlido māḍāḍudāne
tĕralo nŏkkadĕm̐ gūḍi kĕraliṁtuvu
gŏrabulugānī nīguṇamu lĕṭṭu ganedi
sari nābai nidivo sesalu salle vibuḍu

(||||)
vĕlaya bhūgāṁtanu vīm̐punanu mosugŏni
ālamelumaṁga nuramaṁdu mosevu
tĕlisi śhrī veṁkaḍeśha devigā nannelidivi
valĕnani muvvaṁkalā valasidi vibuḍu