Aayanaaya nooragumdu mamte saalu

ఆయనాయ నూరకుండు మంతే చాలు
Language

(॥పల్లవి॥)
ఆయనాయ నూరకుండు మంతే చాలు
చాయలు సన్నలు నైతేఁ జప్పనయ్యీ నిఁకను

(॥॥)
కన్నులు దెరచి చెలి గక్కున రెప్పలు వంచె
వెన్నెలో అది నీకు వేసఁగో కాని
మున్నిటి మీ మోహముల ముచ్చటల కొలఁదింతే
పన్ని నేము చెప్పఁబోతే పచ్చిదోఁచు నిఁకను

(॥॥)
పెదవులు గదలించి పేరుకొన కూరకుండె-
నది నీకుఁ జిగురో చేగాయనో కాని
యెదుట మీలోలోనే యెనసినకొలఁ దింతే
పొదిగి యేమన్నాను పొరయెత్తీ నిఁకను

(॥॥)
చేరి నీయెదుట నుండి చిఱునవ్వు నవ్వె నింతె
పేరడి నీ కవి పాలో పెరుగోకాని
కూరిమి శ్రీవేంకటేశ కూడితి రిద్దరు నిట్టె
మేరతో నెవ్వ రేమన్నా మితిమీరీ నిఁకను

(||pallavi||)
āyanāya nūraguṁḍu maṁte sālu
sāyalu sannalu naidem̐ jappanayyī nim̐kanu

(||||)
kannulu dĕrasi sĕli gakkuna rĕppalu vaṁchĕ
vĕnnĕlo adi nīgu vesam̐go kāni
munniḍi mī mohamula muchchaḍala kŏlam̐diṁte
panni nemu sĕppam̐bode pachchidom̐su nim̐kanu

(||||)
pĕdavulu gadaliṁchi perugŏna kūraguṁḍĕ-
nadi nīgum̐ jiguro segāyano kāni
yĕduḍa mīlolone yĕnasinagŏlam̐ diṁte
pŏdigi yemannānu pŏrayĕttī nim̐kanu

(||||)
seri nīyĕduḍa nuṁḍi siṟunavvu navvĕ niṁtĕ
peraḍi nī kavi pālo pĕrugogāni
kūrimi śhrīveṁkaḍeśha kūḍidi riddaru niṭṭĕ
merado nĕvva remannā midimīrī nim̐kanu