Aayanaaya neeyemme ladumdaneeve

ఆయనాయ నీయెమ్మె లటుండనీవే
Language

(॥పల్లవి॥)
ఆయనాయ నీయెమ్మె లటుండనీవే
నీయంత నీవెఱఁగవు నేనైనాఁ జెప్పేను

(॥॥)
వంతులకే వచ్చేవు వాసులెల్ల నెరుపేవు
వంతములు చూపఁగ నాపాటిదానవా
మంతనాన నప్పటి నామగనితో నవ్వేవు
యెంతలేదే నీపగటు యేమి చెప్పేదే

(॥॥)
పురుండ్లకుఁ జేరువు పొత్తుల మాటడేవు
సరుసఁ గూచుండఁగ నాసరిదానవా
తెరమాఁటుననే వుండి తేలించేవు రమణుని
తొరలినంతటిలోనే దొరవయ్యేవా

(॥॥)
సలిగెలు మెరసేవు సాటి కిట్టె పెనఁగేవు
అలమేలమంగను నాయంతదానవా
కలసెను నన్ను శ్రీ వేంకటేశుఁడు నీవు మెచ్చే-
వెలమి నీకుఁ గారణ మేమైనాఁ గలదా

(||pallavi||)
āyanāya nīyĕmmĕ laḍuṁḍanīve
nīyaṁta nīvĕṟam̐gavu nenainām̐ jĕppenu

(||||)
vaṁtulage vachchevu vāsulĕlla nĕrubevu
vaṁtamulu sūbam̐ga nābāḍidānavā
maṁtanāna nappaḍi nāmaganido navvevu
yĕṁtalede nībagaḍu yemi sĕppede

(||||)
puruṁḍlagum̐ jeruvu pŏttula māḍaḍevu
sarusam̐ gūsuṁḍam̐ga nāsaridānavā
tĕramām̐ṭunane vuṁḍi teliṁchevu ramaṇuni
tŏralinaṁtaḍilone dŏravayyevā

(||||)
saligĕlu mĕrasevu sāḍi kiṭṭĕ pĕnam̐gevu
alamelamaṁganu nāyaṁtadānavā
kalasĕnu nannu śhrī veṁkaḍeśhum̐ḍu nīvu mĕchche-
vĕlami nīgum̐ gāraṇa memainām̐ galadā