Aayanaaya neemaade yanare aadanidonu

ఆయనాయ నీమాటే యనరే ఆతనితోను
Language

(॥పల్లవి॥)
ఆయనాయ నీమాటే యనరే ఆతనితోను
యేయెడాఁ దనవిద్యలు నిందరుఁ జూడనివా

(॥॥)
వుదుటున నానతియ్యకుండితే మానెఁ గాక
యెదలోనితనయెన్ని కెరఁగనిదా
చెదరక తాఁగొత్తలు సేసితేఁ జేసెఁగాక
మొదలనే తనతో సాములు నేఁ జేయనివా

(॥॥)
ఇక్కడఁ దా నమ్మిక నాకిచ్చితే నిచ్చెఁ గాక
చొక్కపుఁ దనగుణము సోదించనిదా
అక్కరతో నాచన్నులంటితే నంటెఁ గాక
మక్కువఁ దనగోరితో మారుమలయనివా

(॥॥)
బెట్టియానలెల్లా నేఁడు పెట్టితేఁ బెట్టెఁ గాక
నెట్టనఁ దనసుద్దులు నే విననివా
ఇట్టె తా శ్రీ వేంకటేశుఁ డేలితే నేలెఁ గాక
చుట్టపుతనమేలు నేఁ జూడనిదా

(||pallavi||)
āyanāya nīmāḍe yanare ādanidonu
yeyĕḍām̐ danavidyalu niṁdarum̐ jūḍanivā

(||||)
vuduḍuna nānadiyyaguṁḍide mānĕm̐ gāga
yĕdalonidanayĕnni kĕram̐ganidā
sĕdaraga tām̐gŏttalu sesidem̐ jesĕm̐gāga
mŏdalane tanado sāmulu nem̐ jeyanivā

(||||)
ikkaḍam̐ dā nammiga nāgichchide nichchĕm̐ gāga
sŏkkabum̐ danaguṇamu sodiṁchanidā
akkarado nāsannulaṁṭide naṁṭĕm̐ gāga
makkuvam̐ danagorido mārumalayanivā

(||||)
bĕṭṭiyānalĕllā nem̐ḍu pĕṭṭidem̐ bĕṭṭĕm̐ gāga
nĕṭṭanam̐ danasuddulu ne vinanivā
iṭṭĕ tā śhrī veṁkaḍeśhum̐ ḍelide nelĕm̐ gāga
suṭṭabudanamelu nem̐ jūḍanidā