Aayanaaya neegimta yaasaaraala godavela

ఆయనాయ నీకింత యాచారాల గొడవేల
Language

(॥పల్లవి॥)
ఆయనాయ నీకింత యాచారాల గొడవేల
పాయపు మదము నీవు పట్టుకుండఁ గలవా

(॥ఆయ॥)
పూచినతంగేడువలెఁ బొలఁతి సింగారించుక
యేచి నిలుచున్నది నీయెదుటను
చేచేత చెరఁగుమాసి వుండితే నేమాయ
చూచిచూచి యంట కోరుచుకుండఁగలవా

(॥ఆయ॥)
పచ్చనిచిలుకవలెఁ బడఁతి చదువుకొంటా
మచ్చికలు చూపీ నీమంచముపొంత
మెచ్చులుగ దడిబెముమీఁద నుంటే నేమాయ
కిచ్చురేఁగి ముట్టి తమకించకుండఁగలవా

(॥ఆయ॥)
మూసినముత్యమువలె ముదిత కాఁగిట నిల్చి
ఆసకొల్పీ శ్రీవేంకటాధిప నిన్ను
సేసవెట్టి నాలునాళ్లు చేసితే నందుకేమాయ
వాసితోడఁ బొంది వలవకుండఁగలవా

(||pallavi||)
āyanāya nīgiṁta yāsārāla gŏḍavela
pāyabu madamu nīvu paṭṭuguṁḍam̐ galavā

(||āya||)
pūsinadaṁgeḍuvalĕm̐ bŏlam̐ti siṁgāriṁchuga
yesi nilusunnadi nīyĕduḍanu
seseda sĕram̐gumāsi vuṁḍide nemāya
sūsisūsi yaṁṭa korusuguṁḍam̐galavā

(||āya||)
pachchanisilugavalĕm̐ baḍam̐ti saduvugŏṁṭā
machchigalu sūbī nīmaṁchamubŏṁta
mĕchchuluga daḍibĕmumīm̐da nuṁṭe nemāya
kichchurem̐gi muṭṭi tamagiṁchaguṁḍam̐galavā

(||āya||)
mūsinamutyamuvalĕ mudida kām̐giḍa nilsi
āsagŏlbī śhrīveṁkaḍādhiba ninnu
sesavĕṭṭi nālunāḽlu seside naṁdugemāya
vāsidoḍam̐ bŏṁdi valavaguṁḍam̐galavā