Aayanaaya needa sari yaamka lemtigi nee

ఆయనాయ నీడ సరి యాఁక లేఁటికి నీ
Language

(॥పల్లవి॥)
ఆయనాయ నీడ సరి యాఁక లేఁటికి నీ
నే యింతికి వలచిన యీడకే తెచ్చే నయ్యా

(॥ఆయ॥)
చిత్తమొకవంకఁ బెట్టి చేరి నీవు నాకు వట్టి
బత్తు లెంత సేసినాను ఫల మేది
హత్తి నీకు నేనెంత ఆయములు ముట్టినాను
కత్తిఁ గోసి నట్టే కాక కరఁగీనా మనసు

(॥ఆయ॥)
చూపు లొకతెపైఁ బెట్టి సొరిది నాతోఁ బెదవి
పైపయిమాట లాడితే పస లేదు
మాపుదాఁకా ని న్నెంత మంచానకుఁ దీసినాను
కోపము వేసటే కాని కూటమి చాలదయ్యా

(॥ఆయ॥)
కాఁక లొకతెకుఁ జేసి కాయము నావై వేసితే
మాఁకువలె నుండుఁ గాక మర్మ మంటీనా
యేఁకటతో శ్రీవేంకటేశ నన్నుఁ గూడితివి
ఆఁకటిరతి వేళకు ఆపెనే నే నయ్యా

(||pallavi||)
āyanāya nīḍa sari yām̐ka lem̐ṭigi nī
ne yiṁtigi valasina yīḍage tĕchche nayyā

(||āya||)
sittamŏgavaṁkam̐ bĕṭṭi seri nīvu nāgu vaṭṭi
battu lĕṁta sesinānu phala medi
hatti nīgu nenĕṁta āyamulu muṭṭinānu
kattim̐ gosi naṭṭe kāga karam̐gīnā manasu

(||āya||)
sūbu lŏgadĕbaim̐ bĕṭṭi sŏridi nādom̐ bĕdavi
paibayimāḍa lāḍide pasa ledu
mābudām̐kā ni nnĕṁta maṁchānagum̐ dīsinānu
kobamu vesaḍe kāni kūḍami sāladayyā

(||āya||)
kām̐ka lŏgadĕgum̐ jesi kāyamu nāvai veside
mām̐kuvalĕ nuṁḍum̐ gāga marma maṁṭīnā
yem̐kaḍado śhrīveṁkaḍeśha nannum̐ gūḍidivi
ām̐kaḍiradi veḽagu ābĕne ne nayyā