ఆయనాయ నందుకేమీ ఆసోద మెఁ(మెం?)తైనఁ గద్దు
(॥పల్లవి॥)
ఆయనాయ నందుకేమీ ఆసోద మెఁ(మెం?)తైనఁ గద్దు
చేయి చాఁచి యింకానేల చెనకేవు నీవు
(॥ఆయ॥)
యెప్పటివాఁడేకావా యెన్ని బాసలు సేసినా
మెప్పించి మమ్మెట్లా నమ్మించేవు నీవు
కుప్పళించి యెఱ్ఱనుంటే కుంకుమ కస్తూరవునా
చిప్పిల మమ్మేల యిఁత చెనకేవు నీవు
(॥ఆయ॥)
యెన్నఁబోతే నీవేకావా యెంతపొందుసేసినాను
ఇన్నటా మాకెట్ల నీ వింపుసేసేవు
కన్నులకుఁ దెల్లనేం గందవొడి కప్రమౌనా
చెన్నుమీర నింకానేల చెనకేవు నీవు
(॥ఆయ॥)
యెంగిలైననీవే కావా యెంత రతిఁ గూడినాను
సంగతిగా మాకు నెట్టు చలిసేసేవు
సంగడి శ్రీవేంకటేశ జవ్వాది పుణుఁ గవునా
చెంగట నున్నాఁ డవేల చెనకేవు నీవు
(||pallavi||)
āyanāya naṁdugemī āsoda mĕm̐(mĕṁ?)tainam̐ gaddu
seyi sām̐si yiṁkānela sĕnagevu nīvu
(||āya||)
yĕppaḍivām̐ḍegāvā yĕnni bāsalu sesinā
mĕppiṁchi mammĕṭlā nammiṁchevu nīvu
kuppaḽiṁchi yĕṭranuṁṭe kuṁkuma kastūravunā
sippila mammela yim̐ta sĕnagevu nīvu
(||āya||)
yĕnnam̐bode nīvegāvā yĕṁtabŏṁdusesinānu
innaḍā māgĕṭla nī viṁpusesevu
kannulagum̐ dĕllaneṁ gaṁdavŏḍi kapramaunā
sĕnnumīra niṁkānela sĕnagevu nīvu
(||āya||)
yĕṁgilainanīve kāvā yĕṁta radim̐ gūḍinānu
saṁgadigā māgu nĕṭṭu salisesevu
saṁgaḍi śhrīveṁkaḍeśha javvādi puṇum̐ gavunā
sĕṁgaḍa nunnām̐ ḍavela sĕnagevu nīvu